Viral Video: పాలు పొంగిపోతున్నాయా.. ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే ఏమవుతుందో చూడండి..
ABN , Publish Date - Mar 02 , 2025 | 12:50 PM
వంట చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులకు కొందరు తెలివైన చిట్కాలను కనుక్కుంటుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ పూరీలు చేసే వారిని చూశాం. కూరగాయలు వేగంగా తరుగుతూ వంట చేసే వారిని కూడా చూశాం. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా..

వంట చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులకు కొందరు తెలివైన చిట్కాలను కనుక్కుంటుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ పూరీలు చేసే వారిని చూశాం. కూరగాయలు వేగంగా తరుగుతూ వంట చేసే వారిని కూడా చూశాం. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ వ్యక్తి పాలు పొంగిపోయే సమస్యకు వినూత్న పరిష్కారం కనుక్కున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇక పాలు పొంగమన్నా పొంగవు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాలు వేడి చేసే సమయంలో చాలాసార్లు పొంగి కిందపడిపోతుంటాయి. దీంతో ఇలాంటి సమయాల్లో ఎవరైనా ఎంతో అప్రమత్తంగా ఉంటారు. పాలు వేడి చేసే సమయంలో స్టవ్ దగ్గరే నిలబడి గమనిస్తుంటారు.
Viral Video: వీధిలో కూరగాయలు కొంటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూడండి..
అయితే ఈ సమస్యకు ఓ వ్యక్తి వినూత్న పరిష్కారాన్ని కనుక్కున్నాడు. పాలు వేడి చేసే సమయంలో గిన్నెలో ఓ చిన్న స్టీల్ కప్పును ఉంచాడు. ఆ తర్వాత అందులో పాలు పోసి వేడి చేశాడు. ఎంత సేపు వేడి చేసినా కూడా పాలు మరుగుతున్నాయే తప్ప పొంగిపోలేదు. ఇలా పాలు పొంగిపోయే (simple trick to prevent milk overflowing) సమస్యకు సింపుల్ ట్రిక్‌తో పరిష్కారం కనుక్కున్నాడన్నమాట.
Viral Video: క్షణం విలువ తెలిపే వీడియో.. కారులో వెళ్తుండగా ముందు గుండెలు అదిరిపోయే సీన్..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ట్రిక్ ఏదో బాగుందే’’.. అంటూ కొందరు, ‘‘పాలు పొంగకుండా భలే ట్రిక్ కనిపెట్టాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 46 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Funny Stunt Video: బాబాయ్ బ్యాలెన్స్ మామూలుగా లేదుగా.. బీరు బాటిల్ స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..