Share News

Viral Funny Video: అందరి వద్దా ఆశీర్వాదం తీసుకున్నాడు.. మధ్యలో ఎలా మస్కా కొట్టాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Mar 04 , 2025 | 03:10 PM

ఓ వివాహ కార్యక్రమంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు అక్కడున్న అతిథులంతా అవాక్కయ్యేలా చేశాడు. కార్యక్రమంలో కుర్చీల్లో కూర్చున్న మహిళ వద్దకు వెళ్లిన యువకుడు.. వారి వద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Funny Video: అందరి వద్దా ఆశీర్వాదం తీసుకున్నాడు.. మధ్యలో ఎలా మస్కా కొట్టాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

ప్రస్తుతం ఎక్కడ ఏ వివాహ జరిగినా ఏదో ఒక వీడియో నెట్టింట వైరల్ అయిపోతోంది. కొన్నిసార్లు కొందరు అతి తెలివిగా చేసే పనులు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. మరికొన్నిసార్లు కొందరు చేసే పనులు అందరికీ తెగ నవ్వి తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి నవ్వు తెప్పించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాహ కార్యక్రమంలో ఓ యువకుడు అందరి వద్దా ఆశీర్వాదం తీసుకున్నాడు. అయితే మధ్యలో అతడు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు అక్కడున్న అతిథులంతా అవాక్కయ్యేలా చేశాడు. కార్యక్రమంలో కుర్చీల్లో కూర్చున్న మహిళ వద్దకు వెళ్లిన యువకుడు.. వారి వద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నించాడు. వరుసగా ఒక్కొక్కరి పాదాలను తాకుతూ ఆశ్వీర్వాదం తీసుకుంటున్నాడు. అంతా ఇలాగే అనుకున్నారు. కానీ కాస్త తీక్షణంగా చూడగా అసలు విషయం బయటపడింది.

Optical illusion: నిజంగా మీరు జీనియస్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న చేపను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


అతను ఆశీర్వాదమైతే తీసుకున్నాడు గానీ.. (Man takes blessings from women) వారి పాదాలను తాకకుండా తన పాదాన్ని తానే తాకుతున్నాడు. తన కాలిని వారి కాళ్లకు దగ్గరగా పెట్టి, ఎలాంటి అనుమానం రాకుండా ముందుకు వంగి తన కాలిని తానే పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలీని ఆ మహిళలు అతన్ని ఆశీర్వదించారు. దూరం నుంచి ఇది గమనించిన వారంతా తెగ నవ్వుకున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: పాలు పొంగిపోతున్నాయా.. ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే ఏమవుతుందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘మహిళలకు భలే మస్కా కొట్టాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాలు ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: క్షణం విలువ తెలిపే వీడియో.. కారులో వెళ్తుండగా ముందు గుండెలు అదిరిపోయే సీన్..


ఇవి కూడా చదవండి..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 04 , 2025 | 03:10 PM