Woman Funny Video: ఫోన్ పిచ్చిలో పడితే ఇంతే.. రోడ్డుపై ఈమె చేసిన ఘనకార్యం చూస్తే ఖంగుతింటారు..
ABN , Publish Date - Mar 04 , 2025 | 09:20 PM
ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటుంది. ఆమె వెనుకే ఓ వ్యక్తి పరుగెత్తూ వస్తాడు. అయితే చివరకు చేసిన తప్పు తెలుసుకుని ఆమె అవాక్కవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఫోన్ పిచ్చిలో పడితే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ప్రస్తుతం ప్రజలపై స్మార్ట్ ఫోన్ ఏస్థాయిలో ప్రభావం చూపుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తిండి లేకుండా ఉంటారేమో గానీ.. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. కొందరైతే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ ఫోన్ లేకుండా గడపలేని పరిస్థితి. ఫోన్ పిచ్చిలో పడి కొందరు ప్రమాదాలకు గురవడం కూడా చూస్తున్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ ఫన్నీ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఫోన్ పిచ్చిలో పడిన ఓ మహిళ.. చివరకు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రజల్లో ఫోన్ పిచ్చి ఎలా ఉందో తెలిపే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ మహిళకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ (woman talking on phone) రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటుంది.
Viral Video: మరీ ఇంత మూఢనమ్మకమా.. రోడ్డుపై ఎర్రటి కుండలు చూసి.. చివరకు ఏం చేశారో చూడండి..
ఇంతలో ఓ వ్యక్తి.. ‘‘మేడం.. మేడం ఆగండి’’.. అంటూ అరుస్తూ ఆమె వెనుకే పరుగెత్తుకుంటూ వస్తుంటాడు. అతడి చేతిలో ఓ చిన్నారి కూడా ఉంటుంది. ఇలా అతను అరుస్తూ రావడంతో కొద్ది సేపటికి ఆమె గమనించి వెనక్కు తిరిగి చూస్తుంది. అతడి వద్దకు వేగంగా వచ్చి ఆ పిల్లాడిని ఎత్తుకుంటుంది. ఫోన్ మాట్లాడుతూ పిల్లాడిని మర్చిపోయి వెళ్తున్నట్లు అక్కడున్న వారికి అర్థమైంది.
Theft Funny Video: ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఎంత తెలివిగా ఎత్తుకెళ్లాడంటే..
పిల్లాడిని ఆమెకు అందించిన అతను.. మందలించడంతో పాటూ సూచనలు కూడా ఇచ్చినట్లు వీడియోలో చూడొచ్చు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కలియుగం చాలా మారిపోయింది’’.. అంటూ కొందరు, ‘‘ఫోన్ పిచ్చిలో పడితే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..