Share News

Woman Viral Reel Video: వంట చేస్తూ రీల్ చేయాలనుకుంది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

ABN , Publish Date - Mar 04 , 2025 | 10:00 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో మగవారితో పాటూ మహిళలు కూడా రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. కొందరు మహిళలు నిత్యం ఇదే పిచ్చిలో గడుపుతున్నారు. ఇంటి పనులు చేస్తూ.. పనిలో పనిగా వాటిని కూడా వీడియోలు తీసి నెట్టింట్లోకి వదులుతున్నారు. ఈ క్రమంలో..

Woman Viral Reel Video: వంట చేస్తూ రీల్ చేయాలనుకుంది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో మగవారితో పాటూ మహిళలు కూడా రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. కొందరు మహిళలు నిత్యం ఇదే పిచ్చిలో గడుపుతున్నారు. ఇంటి పనులు చేస్తూ.. పనిలో పనిగా వాటిని కూడా వీడియోలు తీసి నెట్టింట్లోకి వదులుతున్నారు. ఈ క్రమంలో కొందరు అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తున్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ వంట చేస్తూ రీల్స్ చేయాలని చూసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వంట చేస్తూ రీల్ చేయాలని అనుకుంది. ఇందుకోసం గ్యాస్ స్టవ్ ఎదురుగా ఫోన్ నిలబెట్టింది. గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన ఆమె.. మధ్యలో (woman doing Reels while cooking) కెమెరా ఆన్ చేసింది. అయితే ఈ క్రమంలో ఆమె చున్నీ మంటకు తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఊహించని విధంగా మంటలు చెలరేగడంతో ఆమె ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి పారిపోతుంది.

Woman Funny Video: ఫోన్ పిచ్చిలో పడితే ఇంతే.. రోడ్డుపై ఈమె చేసిన ఘనకార్యం చూస్తే ఖంగుతింటారు..


చివరకు అతి కష్టం మీద ఆ మంటలన్నింటినీ ఆర్పేసుకుంటుంది. పెద్ద ప్రమాదం తృటిలో తప్పిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా పనులు చేస్తూ రీల్స్ చేసే క్రమంలో ప్రమాదానికి గురైన వారిని నిత్యం చూస్తుంటాం. పుట్టిన రోజు కేక్ కట్ చేస్తూ ఓ యువతి అగ్నిప్రమాదానికి గురైన వీడియో చూశాం. వర్షంలో రీల్స్ చేస్తూ కిండపడి నవ్వులపాలైన యువతులను కూడా చూశాం.

Viral Video: మరీ ఇంత మూఢనమ్మకమా.. రోడ్డుపై ఎర్రటి కుండలు చూసి.. చివరకు ఏం చేశారో చూడండి..


తాజాగా, వంట చేస్తూ ప్రమాదానికి గురైన యమహిళ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘రీల్స్ పిచ్చిలో పడితే ఇలాగే అవుతుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లోనూ రీల్స్ చేయడం అవసరమా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 వేలకు పైగా లైక్‌లు, 3.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Theft Funny Video: ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఎంత తెలివిగా ఎత్తుకెళ్లాడంటే..


ఇవి కూడా చదవండి..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Updated Date - Mar 04 , 2025 | 10:40 PM