Watermelon Viral Video: వామ్మో.. పుచ్చకాయ ఇలాక్కూడా ఉంటుందా.. వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
ABN , Publish Date - Mar 05 , 2025 | 06:19 PM
ఓ వ్యక్తి పుచ్చకాయను కొనుక్కుని వచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. కొంత సమయం తర్వాత దాన్ని కోయడానికి బయటకి తీశాడు. బయటికి తీసిన కాయను రెండు ముక్కలు చేశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే.. ఇక రానున్న రెండు నెలల్లో ఇంకెలా ఉంటాయో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా.. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు అనేక మంది చల్లని పానీయాలు, పుచ్చకాయలు వంటివి తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, పుచ్చకాయ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘పుచ్చకాయ ఇలాక్కూడా ఉంటుందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పుచ్చకాయను (watermelon) కొనుక్కుని వచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. కొంత సమయం తర్వాత దాన్ని కోయడానికి బయటకి తీశాడు. బయటికి తీసిన కాయను రెండు ముక్కలు చేశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
పుచ్చకాయను సగం కోసిన తర్వాత.. పరిశీలించి చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది. కాయ పైన ఉన్న నలుపు మొత్తం తొక్క తీసినట్లుగా ఊడి వస్తోంది. దాన్ని తీసి చూడగా లోపల కాయ పచ్చగా కనిపిస్తోంది. ఇలా పైన ఉన్న నలుపు మొత్తం తొక్కలా తీసేయగా.. పచ్చ రంగులో ఉన్న కాయ మాత్రం మిగిలింది. కొనేటప్పుడు నల్లగా ఉన్న కాయ.. ఇలా ఆచు పచ్చగా కనిపించడం చూసి అతను షాక్ అయ్యాడు.
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఆఖరికి పుచ్చకాయలు కూడా కల్తీ అవుతున్నాయా’’.. అంటూ కొందరు, ‘‘పుచ్చకాయను ఎక్కువసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచితే ఇలాగే అవుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 43 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Elephant Viral Video: పిల్ల ఏనుగే కదా అని దాడి చేసింది.. ఈ మొసలి పరిస్థితి చివరకు ఏమైందంటే..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..