Share News

Viral Video: ప్రాంక్ చేసే ముందు ఆలోచించడం బెటర్.. ఈ యువకుడి పరిస్థితి ఏమైందో చూస్తే.. అవాక్కవుతారు..

ABN , Publish Date - Mar 06 , 2025 | 07:06 PM

ఓ యువకుడు రద్దీగా ఉన్న రోడ్డుపై వినూత్న ప్రాంక్ వీడియో చేసేందుకు సిద్ధమయ్యాడు. యువతిని తీసుకుని రోడ్డు పైకి వెళ్లిన అతను.. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు నటించాడు. అయితే ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Viral Video: ప్రాంక్ చేసే ముందు ఆలోచించడం బెటర్.. ఈ యువకుడి పరిస్థితి ఏమైందో చూస్తే.. అవాక్కవుతారు..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎంతో మంది ఫోన్ ద్వారానే లక్షలు సంపాదిస్తు్న్నారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. ఇలా అనేక వేదికల్లో వీడియోలను షేర్ చేయడం ద్వారా ఫేమస్ అవడమే కాకుండా ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు. అయితే కొందరు వీడియోల పేరుతో బహిరంగ ప్రదేశాల్లో జనాలను ఇబ్బంది పెడుతుంటారు. మరికొందరు ప్రాంక్ వీడియోల పేరుతో అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంటారు. తాజాగా, ఇలా ప్రాంక్ చేస్తున్న యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ప్రాంక్ చేసే ముందు ఆలోచించడం బెటర్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రద్దీగా ఉన్న రోడ్డుపై వినూత్న ప్రాంక్ వీడియో చేసేందుకు సిద్ధమయ్యాడు. యువతిని తీసుకుని రోడ్డు పైకి వెళ్లిన అతను.. ఆమె పట్ల అసభ్యకరంగా (man pranked young woman) ప్రవర్తిస్తున్నట్లు నటించాడు. ఈ ఘటన చూసి చుట్టు పక్కల వారు ఎవరూ స్పందిచలేదు. ‘‘మనకెందుకొచ్చిన సమస్య’’.. అనుకుంటూ ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసుకుంటున్నారే గానీ.. ఆమెను కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు.

Cycle Stunt Video: చావు కొనితెచ్చుకోవడమంటే ఇదే.. ఇతడి సైకిల్ విన్యాసం చూస్తే.. షాకవ్వాల్సిందే..


అయితే ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అటుగా కారులో వచ్చిన ఓ వృద్ధుడు.. ఎదురుగా యువతిని వేధిస్తున్న యువకుడిని గమనించాడు. అది నిజమే అనుకున్న వృద్ధుడు.. వాహనం ఆపి, అందులోని కర్ర తీసుకుని వెళ్లాడు. వెళ్లీవెళ్లడంతోనే (Old man attacks young man with stick) ఆ కుర్రాడిని చితకబాదాడు. వృద్ధుడు ఇలా ఊహించని రీతిలో దాడి చేయడంతో ఆ యువకుడు ఖంగుతిన్నాడు. తప్పించుకునే క్రమంలో పరుగులు పెట్టినా కూడా వదలకుండా దాడి చేశాడు. అక్కడే ఉన్న మహిళ ఆ యువకుడిని కాపాడే ప్రయత్నం చేసింది.

Tiger vs Crocodile Video: నీటి ఒడ్డున మొసలి.. నీళ్లు తాగేందుకు వచ్చిన పులి.. చివరకు జరిగింది చూస్తే..


చివరకు ఆ యువకుడు చేసింది ప్రాంక్ అని వృద్ధుడికి తెలిసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఇలా.. ప్రాంక్ చేయాలని చూసిన యువకుడికి వృద్ధుడు షాకిచ్చాడన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏదో చేయాలని చూస్తే చివరకు ఇంకేమో అయిందే’’.. అంటూ కొందరు, ‘‘పెద్దాయన అసలైన రీల్‌ను తయారు చేసి ఇచ్చాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9వేలకు పైగా లైక్‌లు, 1.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: భార్యలు షాపింగ్‌ చేస్తే భర్తలకు పండుగే.. ఈ ఆఫరేదో అదిరిపోయిందిగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

Horse Funny Video: గుర్రం కిక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ కుక్క పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Updated Date - Mar 06 , 2025 | 07:06 PM