Viral Video: భార్యలు షాపింగ్ చేస్తే భర్తలకు పండుగే.. ఈ ఆఫరేదో అదిరిపోయిందిగా..
ABN , Publish Date - Mar 06 , 2025 | 04:04 PM
రోడ్డు పక్కన ఓ పెద్ద దుకాణం ఎదురుగా కొన్ని వాహనాలు ఆగి ఉన్నాయి. ఆ దుకాణం ముందు ఓ బోర్డు కూడా ఉంది. ఇందులో విశేషం ఏముందీ అనేగా మీ సందేహం. ఆ బోర్డుపై రాసి ఉన్నది చూసి అంతా అవాక్కవుతున్నారు.

భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ముఖ్యంగా భార్యలు షాపింగ్ చేయడం.. భర్తలకు పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. వెళ్లే ముందు అనుకున్నది వేరు.. షాపింగ్‌లోకి దిగాక తీసుకునేది వేరుగా ఉంటుంది. సమయం పెరిగిపోవడంతో పాటూ బిల్లు కూడా పెరిగిపోతుంటుంది. ఈ సమస్య మీద అనేక తమాషా రీల్స్ వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇకపై భార్యలు షాపింగ్ చేస్తే భర్తలకు పండుగే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో ఎక్కడిదో ఏమో గానీ.. సోషల్ మీడియాలో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఓ పెద్ద దుకాణం ఎదురుగా కొన్ని వాహనాలు ఆగి ఉన్నాయి. ఆ దుకాణం ముందు ఓ బోర్డు కూడా ఉంది. ఇందులో విశేషం ఏముందీ అనేగా మీ సందేహం. ఆ బోర్డుపై రాసి ఉన్నది చూసి అంతా అవాక్కవుతున్నారు. ‘‘HUSBAND DAY CARE CENTRE’’ అని రాసి ఉంది.
Optical Illusion: ఈ రెండు చిత్రాల్లో దాగి ఉన్న.. 3 తేడాలను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
మీరు షాపింగ్ వెళ్లినా, మరెక్కడికి వెళ్లాలని అనుకున్నా కూడా మీ భర్తలను ఇక్కడ వదిలిపెట్టండి... అని రాస్తూ అక్కడ కోల్డ్ బీరు లభిస్తుందని కూడా ప్రస్తావించారు. అలాగే రగ్బీ అని కూడా రాసి ఉంది. సాధారణంగా దంపతులు షాకింగ్ వెళ్లిన సమంయలో పిల్లలను కేర్ సెంటర్లలో వదులుతుంటారు. ఇక్కడేమే ఏకంగా భర్తలను వదిలిపెట్టండంటూ బోర్డు పెట్టడంతో అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.
Cat Viral Video: పిల్లిలో తల్లి ప్రేమ.. పిల్లలను ఆడించడానికి ఎంత కష్టపడిందో చూస్తే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రతి భర్త ఇక్కడ ఉండేందుకు ముందుకొస్తాడు’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఆఫరేదో చాలా బాగుందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.65 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..