Cycle Stunt Video: చావు కొనితెచ్చుకోవడమంటే ఇదే.. ఇతడి సైకిల్ విన్యాసం చూస్తే.. షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Mar 06 , 2025 | 05:56 PM
వాహనాలపై విన్యాసాలు చేయడం ప్రస్తుతం ఫ్యాఫన్‌గా మారిపోయింది. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ వ్యక్తి సైకిల్‌పై చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు..

కొందరు వినూత్న విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సైకిల్‌పై చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘చావు కొనితెచ్చుకోవడమంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం చాలా మంది యువకులు పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో అనేక విన్యాసాలు చేయడం చూస్తుంటాం. ఈ క్రమంలో కొందరు చావు అంచులదాకా వెళ్లి వస్తుంటారు. తాజాగా, ఓ యువకుడు సైకిల్‌ను తొక్కడం (Dangerous stunt on cycle) చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
సైకిల్‌తో రోడ్డు పైకి వెళ్లిన అతను.. వేగంగా తొక్కడమే కాకుండా ముంద చక్రాన్ని గాల్లోకి లేపి నడిపాడు. ముందు చక్రం గాల్లో ఉండగానే సైకిల్‌ను అత్యంత వేగంగా తొక్కుతూ ఎదురుగా వస్తున్న లారీ ముందుకు వెళ్లాడు. లారీ సమీపానికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా సైకిల్‌ను పక్కకు మళ్లిస్తాడు. ఆ సమయంలో ఒక్క క్షణం అటూ, ఇటూ అయినా ప్రాణాలు పోయే పరిస్థితి. ఇలా అతను చాలా దూరం వరకూ సైకిల్‌ను అలా ప్రమాదకరంగా నడుపుతూ వెళ్లాడు.
Viral Video: భార్యలు షాపింగ్ చేస్తే భర్తలకు పండుగే.. ఈ ఆఫరేదో అదిరిపోయిందిగా..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. వీడేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘చావు కొనితెచ్చుకోవడమంటే ఇదే’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదకరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 100కి పైగా లైక్‌లు, 16 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..