Viral Video: వీళ్లు మనుషులేనా.. లారీ డ్రైవర్ మంటల్లో కాలుతున్నా.. ఏం చేస్తున్నారో చూడండి..
ABN , Publish Date - Mar 07 , 2025 | 03:28 PM
ఓ లారీ ప్రమాదవశాత్తు ఎదురుగా ఉన్న మరో లారీని వెనుక వైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ఇంజిన్ వైపు భాగం నుజ్జునుజ్జయింది. దీంతో డ్రైవర్.. సీటుకు, స్టీరింగ్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. ప్రమాద దాటికి ఇంజిన్‌లో మంటలు చెలరేగి డ్రైవర్‌కు అంటుకున్నాయి. అయితే ఈ సందర్భంగా స్థానికులు చేసిన నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

మానవత్వం రోజురోజుకూ మంటగలిసిపోతోంది. సాటి మనిషి చచ్చిపోతున్నా పట్టించుకోని సమాజం మనది. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయకపోగా మరిన్ని ఇబ్బందులు పెట్టి రాక్షసానందం పొందుతుంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మంటల్లో చిక్కుకున్న లారీ డ్రైవర్‌ను కాపాడాల్సింది పోయి చోద్యం చూస్తున్నారు. వారు చేస్తున్న నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వీళ్లు మనుషులేనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ లారీ ప్రమాదవశాత్తు ఎదురుగా ఉన్న మరో లారీని వెనుక వైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ఇంజిన్ వైపు భాగం నుజ్జునుజ్జయింది. దీంతో డ్రైవర్.. సీటుకు, స్టీరింగ్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. ప్రమాద దాటికి ఇంజిన్‌లో మంటలు చెలరేగి డ్రైవర్‌కు అంటుకున్నాయి.
Optical illusion: మీ కంటి చూపుకో చాలెంజ్.. ఈ చిత్రంలో దాక్కున్న సీతాకోక చిలుకను కనుక్కోండి చూద్దాం..
అతను ఇంజిన్‌లో ఇరుక్కుపోవడంతో బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. మంటల్లో కాలిపోతూ కాపాడండి.. కాపాడండి.. అంటూ కేకలు పెడుతున్నాడు. అయినా చుట్టుపక్కల వారు అతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. అతన్ని కాపాడకపోగా ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ చోద్యం చూస్తున్నారు. ఆ డ్రైవర్ చాలా సేపు (Lorry driver burning in flames) మంటల్లో చిక్కుకుని విలవిల్లాడిపోవడం వీడియోలో కనిపించింది.
Snake Viral Video: స్కూటీపై వస్తున్న వ్యక్తి.. మధ్యలో సడన్‌గా రోడ్డుపైకి దూసుకొచ్చిన పాము.. చివరకు..
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఛీ.. ఛీ.. వీళ్లు మనుషులేనా’’.. అంటూ కొందరు, ‘‘మానవత్వం చచ్చిపోయిందనడానికి ఇదే నిదర్శనం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: ప్రాంక్ చేసే ముందు ఆలోచించడం బెటర్.. ఈ యువకుడి పరిస్థితి ఏమైందో చూస్తే.. అవాక్కవుతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..