Optical illusion: మీ కంటి చూపుకో చాలెంజ్.. ఈ చిత్రంలో దాక్కున్న సీతాకోక చిలుకను కనుక్కోండి చూద్దాం..
ABN , Publish Date - Mar 06 , 2025 | 09:35 PM
ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ వృద్ధురాలు సోఫాలో కూర్చుని ఏదో పని చేస్తుంటుంది. ఆమె పక్కన కుక్క పిల్లతో పాటూ అనేక పిల్లులు కూడా ఉంటాయి. అయితే ఇదే చిత్రంలో ఓ సీతాకోక చిలుక కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి..

మెదడుకు మేత అందించి షార్ప్‌గా మార్చే సాధనాలు అనేకం అందుబాటులో ఉన్నా కూడా.. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అంతా వీటి పట్ల ఆకర్షితులవుతుంటారు. ఈ చిత్రాలు చూసేందుకు సాధారణంగా కనిపించినా.. అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. అందుకే ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు అంతా తెగ ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా, మీకోసం ఓ ఆసక్తికర పజిల్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో దాగి ఉన్న సీతాకోక చిలుకను గుర్తించేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ వృద్ధురాలు సోఫాలో కూర్చుని ఏదో పని చేస్తుంటుంది. ఆమె పక్కన కుక్క పిల్లతో పాటూ అనేక పిల్లులు కూడా ఉంటాయి.
అలాగే అటు పక్కన టేబుల్‌పై ఓ లైటు, కాఫీ ఉంటాయి. ఆ వెనుక ర్యాక్‌లో అనేక వస్తువులను కూడా చూడొచ్చు. ఆమె వెనుక గోడపై కొన్ని ఫొటోలు కూడా ఉంటాయి. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే మీ కంటికి ఓ పరీక్ష పెడుతున్నాం.
ఈ చిత్రంలో ఓ సీతాకోక చిలుక కూడా ఉంది. అయితే అది మీ కంటికి కనిపించకుండా (Hidden butterfly) దాక్కుని ఉంది. దాన్ని గుర్తించేందుకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే కేవలం కొందరు మాత్రమే దాన్ని కనిపెట్టగలుగుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం ఆ సీతాకోక చిలుక ఎక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ దాన్ని గుర్తించడం కష్టంగా ఉంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..