Share News

Snake Viral Video: స్కూటీపై వస్తున్న వ్యక్తి.. మధ్యలో సడన్‌గా రోడ్డుపైకి దూసుకొచ్చిన పాము.. చివరకు..

ABN , Publish Date - Mar 06 , 2025 | 09:00 PM

ఓ వ్యక్తి స్కూటీపై వేగంగా వస్తుంటాడు. అయితే మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటి అవతలికి వెళ్లిపోతున్న ఓ పాము.. సడన్‌గా వెనక్కు తిరిగి మళ్లీ రోడ్డు మధ్యలోకి వచ్చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Snake Viral Video: స్కూటీపై వస్తున్న వ్యక్తి.. మధ్యలో సడన్‌గా రోడ్డుపైకి దూసుకొచ్చిన పాము.. చివరకు..
Man Ran Away From Snake

పాములు కొన్నిసార్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. నీళ్లు తాగుదామని ఫ్రిడ్జ్ వద్దకు వస్తే.. లోపలి నుంచి బయటికి దూసుకొస్తాయి. పడుకుందామని మంచం వద్దకు వెళ్తే కింద నుంచి బుసలు కొడుతూ పైకి వస్తాయి. అలాగే బయటికి వెళ్దామని బైకు బయటికి తీస్తే.. లైటు మధ్యలో నుంచి పొడుచుకువచ్చి పారిపోయేలా చేస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి స్కూటీపై వేగంగా వస్తుండగా సడన్‌గా ఓ పాము రోడ్డు పైకి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి స్కూటీపై వేగంగా వస్తుంటాడు. అయితే మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటి అవతలికి వెళ్లిపోతున్న ఓ పాము.. సడన్‌గా వెనక్కు తిరిగి (snake entered middle of the road) మళ్లీ రోడ్డు మధ్యలోకి వచ్చేసింది. అయితే అప్పటికే ఆ వ్యక్తి అత్యంత సమీపానికి చేరుకున్నాడు.

Viral Video: ప్రాంక్ చేసే ముందు ఆలోచించడం బెటర్.. ఈ యువకుడి పరిస్థితి ఏమైందో చూస్తే.. అవాక్కవుతారు..


ముందు టైరు పాము పైకి ఎక్కగానే గమనించిన ఆ వ్యక్తి.. (man ran away from the snake) స్కూటీని అక్కడే పడేసి పారిపోతాడు. పాము కూడా అక్కడి నుంచి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఆ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా అతను పాము కాటుకు గురయ్యే ప్రమాదం ఉండేది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

Cycle Stunt Video: చావు కొనితెచ్చుకోవడమంటే ఇదే.. ఇతడి సైకిల్ విన్యాసం చూస్తే.. షాకవ్వాల్సిందే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చావును దగ్గరగా చూడడమంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టైం ఎంతో బాగుంది.. లేదంటే ప్రాణాలే పోయేవి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 11 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Tiger vs Crocodile Video: నీటి ఒడ్డున మొసలి.. నీళ్లు తాగేందుకు వచ్చిన పులి.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

Horse Funny Video: గుర్రం కిక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ కుక్క పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Updated Date - Mar 06 , 2025 | 09:00 PM