Share News

Snake Bite Viral Video: నల్ల అద్దాలు పెట్టుకుని పాముతో గేమ్స్.. చివరకు ఏమైందో చూస్తే..

ABN , Publish Date - Aug 02 , 2025 | 09:30 AM

నల్ల కళ్లద్దాలు ధరించిన ఓ వ్యక్తి పాము ఎదురుగా కూర్చుని పరాచికాలు ఆడాడు. అతన్ని చూడగానే పాము పడగ విప్పి బుసలు కొట్టింది. అయినా ఆ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా తమాషా చేస్తాడు. మధ్య మధ్యలో..

Snake Bite Viral Video: నల్ల అద్దాలు పెట్టుకుని పాముతో గేమ్స్.. చివరకు ఏమైందో చూస్తే..
Man dance in front of snake

పాములంటే ఎవరికైనా భయమే. కనీసం వాటిని కలలో చూసినా కూడా భయంతో వణికిపోతుంటారు. అయితే కొందరు మాత్రం వాటితో పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతూ రెచ్చగొడుతుంటారు. మరికొందరు పది మందిలో హీరోలా బిల్డప్ ఇస్తూ పాములను పట్టుకోవడం, మెడలో వేసుకోవడం, నడుముకు చుట్టుకోవడం చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నల్ల కళ్లద్దాలు పెట్టుకున్న ఓ వ్యక్తి పాముతో గేమ్స్ ఆడాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నల్ల కళ్లద్దాలు ధరించిన ఓ వ్యక్తి పాము ఎదురుగా కూర్చుని పరాచికాలు ఆడాడు. అతన్ని చూడగానే పాము పడగ విప్పి బుసలు కొట్టింది. అయినా ఆ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా తమాషా చేస్తాడు. మధ్య మధ్యలో రెండు చేతులు (Man danced Nagini in front of snake) దగ్గరగా పెట్టుకుని నాగిని డాన్స్ చేస్తాడు.


అంతటితో ఆగకుండా మరో మరింత రెచ్చిపోతాడు. చివరకు పామును పట్టుకుని ఏకంగా మెడలోనే వేసుకుంటాడు. మెడలో వేసుకుని, రెండు చేతులతో అటూ, ఇటూ కదిలిస్తూ అందరి ముందు షో చేస్తాడు. అయితే ఈ క్రమంలో పాము (Snake that bit Man) అతడి చేతిపై కాటు వేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత అతడి చేతి వేలు నల్లగా మారడాన్ని వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత అతను చనిపోయినట్లుగా ఇందులో చూపించారు.


అయితే చూస్తుంటే ఇది నమ్మశక్యం కాకపోయినా.. అతను పాము చేసిన నిర్వాకం చూసి మాత్రం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరమని తెలిసి కూడా పామును ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి వారికి ఇలాగే జరగాలి’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయకండి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా లైక్‌లు, 73 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 09:30 AM