Share News

Leopard VS Crocodile: చిరుత శక్తికి నిలువెత్తు నిదర్శనం.. భారీ మొసలిని.. చూస్తుండగానే..

ABN , Publish Date - Aug 02 , 2025 | 08:29 AM

ఓ చిరుత పులి వేట కోసం అడవిలో గాలిస్తుంది. అయితే దానికి ఆ సమయంలో ఎలాంటి జంతువూ కనిపించిలేదు. ఈ క్రమంలో నీటిలో ఓ పెద్ద మొసలి కనిపిస్తుంది. అప్పటికే ఆకలితో ఉన్న చిరుత.. మొసలిని చూడగానే దాడి చేస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Leopard VS Crocodile: చిరుత శక్తికి నిలువెత్తు నిదర్శనం.. భారీ మొసలిని.. చూస్తుండగానే..

వేగం అంటే టక్కున గుర్తొచ్చేది చిరుత. వేగానికే కాకుండా వేటాడడంలోనూ చిరుత రూటే సపరేటు అని చెప్పొచ్చు. కళ్లు చెదిరే వేగంతో పరుగులు తీస్తూ రెప్పపాటు కాలంలోనే వేటను మట్టికరిపిస్తుంది. ఆకలిగా ఉన్న సమయలో అవతల ఉన్నది ఎలా జంతువైనా సరే.. దానికి ఆహారమైపోవాల్సిందే. కొన్నిసార్లు చిరుత వేట చూస్తే.. ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. అలాంటి ఆశ్చర్యకర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నీళ్లలోని భారీ మొసలిపై చిరుత దాడి చేసింది. చివరకు జరిగిన ఘటన చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. చిరుత శక్తికి నిలువెత్తు నిదర్శనం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిరుత పులి వేట కోసం అడవిలో గాలిస్తుంది. అయితే దానికి ఆ సమయంలో ఎలాంటి జంతువూ కనిపించిలేదు. ఈ క్రమంలో నీటిలో ఓ పెద్ద మొసలి కనిపిస్తుంది. అప్పటికే ఆకలితో ఉన్న చిరుత.. మొసలిని చూడగానే, ఎలాగైనా వేటాడాలని ఫిక్స్ అవుతుంది. అనుకున్నదే తడవుగా (Leopard attacks crocodile) నీటిలోకి దూకి మొసలిపై ఎటాక్ చేసింది.


చిరుత నుంచి తప్పించుకోవడానికి మొసలి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరకు దాని మెడ పట్టుకున్న చిరుత.. అంత బరువుగా ఉన్న మొసలిని సైతం.. ఎంతో అవలీలగా చెట్టు కొమ్మపైకి లాగేస్తుంది. ఓ వైపు కొమ్మపై బ్యాలెన్స్ చేసుకుంటూనే.. మరోవైపు మొసలిని నోట కరుచుకుని అడవిలోకి వెళ్లిపోతుంది. ఇలా భారీ మొసలిని ఎంతో అవలీలగా వేటాడిని చిరుతను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పర్యాటకులు.. ఈ ఘటనను తమ కెమెరాల్లో బంధించారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. చిరుత బలం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘చిరుత బలం.. బ్యాలెన్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 6.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 09:51 AM