Viral video:రాత్రి వేళ బస్సులో వ్యక్తి అసభ్య నిర్వాకం.. పక్క సీటులోని వ్యక్తి కెమెరా ఆన్ చేయగా..
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:53 PM
రాత్రి సమయంలో బస్సులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మార్గ మధ్యలో యువతి పక్క సీటులోని ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. యువతి తన వైపు చూడగానే మరింత రెచ్చిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..

కొందరు శాడిస్టులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర పనులు చేస్తూ శునకానందం పొందుతుంటారు. గుంపులో మహిళలను తాకరాని చోట తాకుతూ కొందరు, ఒంటరిగా ఉన్న మహిళల ముందు మరికొందరు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాత్రి వేళ బస్సులో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన సతారా నుండి పూణే వెళ్తున్న బస్సులో (Satara to Pune Bus) జరిగింది. రాత్రి సమయంలో బస్సులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మార్గ మధ్యలో యువతి పక్క సీటులోని (man indecent behavior in front of women) ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. యువతి తన వైపు చూడగానే అతను మరింత రెచ్చిపోయాడు.
Puzzle:ఈ రెండు చిత్రాల్లో దాగి ఉన్న 5 తేడాలను కనుక్కుంటే.. మీ కంటి చూపునకు తిరుగులేనట్లే..
అతడి చేష్టలతో ఆమె ఇబ్బందిపడుతున్నా కూడా ఆ వ్యక్తి చాలా సేపు అలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. కాసేపటి తర్వాత అతడి నిర్వాకం చూసి షాకైన ఓ వ్యక్తి.. తన ఫోన్‌తో వీడియోలు తీయడం స్టార్ట్ చేశాడు. అయినా ఆ వ్యక్తి మాత్రం చాలా సేపు అలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు.
Tricks Viral Video:కుళాయికి పైపు తగిలించడం ఇంత ఈజీనా.. ఈ ట్రిక్ ఏదో అదిరిందిగా..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి సమయాల్లో ధైర్యంగా పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి’’.. అంటూ కొందరు, ‘‘డ్రైవర్‌కు చెప్పి బస్సును నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఉండాల్సింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Drunken Woman Video: ఇద్దరు యువకుల మధ్యలో యువతి.. బైక్‌పై ఆమె నిర్వాకం చూసి వాహనదారుల షాక్..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..