Viral Video: అదృష్టం అడ్డం తిరిగితే ఇలాగే అవుతుంది.. ఈ వైల్డ్ బీస్ట్‌కు ఏమైందో చూడండి..
ABN , Publish Date - Mar 08 , 2025 | 05:40 PM
అదృష్టం బలంగా ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా చిన్న గాయం కూడా కాదు. అదే అదృష్టం కలిసిరాకపోతే మాత్రం చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా ఏకంగా ప్రాణాలే పోతుంటాయి. అలాగే ప్రమాదం నుంచి ఎంత బయటపడాలని చూసినా..

అదృష్టం బలంగా ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా చిన్న గాయం కూడా కాదు. అదే అదృష్టం కలిసిరాకపోతే మాత్రం చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా ఏకంగా ప్రాణాలే పోతుంటాయి. అలాగే ప్రమాదం నుంచి ఎంత బయటపడాలని చూసినా మృత్యువుకు దొరికిపోయే పరిస్థితి వస్తుంటుంది. మనుషులే కాకుండా జంతువుల విషయంలోనూ ఇలాగే జరగుతుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మొసలి నుంచి తప్పించుకోవాలని చూసిన వైల్డ్ బీస్ట్ పరిస్థితి చివరకు ఏమైందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. ఓ వైల్డ్ బీస్ట్ నీళ్లు తాగే క్రమంలో ప్రమాదవశాత్తు పైనుంచి లోయలోకి జారిపోతుంది. అదే సమయంలో ఆకలితో ఉన్న ఓ పెద్ద మొసలి కంటపడుతుంది. వైల్డ్ బీస్ట్‌ను చూడగానే దాడి చేయడానికి వెళ్తుంది. దాన్నుంచి బయటపడే క్రమంలో కింద నుంచి పైకి ఎక్కే ప్రయత్నం చేస్తుంది.
Viral Video: స్కూటీపై వెళ్తున్న మహిళ.. వెనుక పిల్లాడిని గమనించిన బైకర్.. సమీపానికి వెళ్లి చూడగా..
అయితే మధ్యలోకి వెళ్లగానే జారిపోయి మళ్లీ నీటిలోకి పడిపోతుంది. ఇలా రెండు సార్లు ప్రయత్నిస్తుంది. రెండోసారి కూడా నీటిలోకి జారిపోతుంది. అయితే ఈసారి మాత్రం పైకి వెళ్లే ఛాన్స్ ఇవ్వకుండా, అక్కడున్న మొసలి.. (Crocodile attacks wild beast) వైల్డ్ బీస్ట్‌ను నీటిలోకి లతో బయటపడాలని చూసి చివరకు మొసలి బారిన పడి చనిపోయింది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: నాతో చోరీ అంత ఈజీ కాదు.. దొంగకు ఎలా షాక్ ఇచ్చిందో చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఈ వైల్డ్ బీస్ట్‌ను చూస్తుంటే బాధేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇది ప్రకృతి ధర్మం.. ఎవరూ దీన్ని ఆపలేరు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8000కి పైగా లైక్‌లు, 4.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: మనోళ్ల భక్తి అట్లుంటది మరి.. ఆలయంలో దేనికి పూజలు చేస్తున్నారో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..