Marriage Funny Video: ఈ వరుడు మరీ చిలిపి సుమీ.. వధువు సోదరికి ఎలా షాక్ ఇచ్చాడో చూస్తే..
ABN , Publish Date - Mar 07 , 2025 | 08:28 PM
ఓ వివాహ కార్యక్రమంలో వరడికి, వధువు సోదరికి మధ్య తమాషా సంఘటన చోటు చేసుకుంది. బంధువుల సమక్షంలో వధువు సోదరి.. వరుడికి రసగుల్లా తినిపించాలని చూస్తుంది. అయితే వరుడు ఆమెకు చివరకు ఎలా షాక్ ఇచ్చాడో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..

వివాహ కార్యక్రమాల్లో వింత వింత సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. కొన్నిసార్ల సినిమా తరహా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లను మించిన ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. వధూవరుల మధ్యలోకి కొన్నిసార్లు యువతులు ప్రవేశిస్తుంటారు. మరికొన్నిసార్లు మరదల్లు వరుడిని ఆటపట్టించండం చూస్తుంటాం. అలాగే అప్పుడప్పుడూ వరుడు కూడా తన మరదలిని ఫూల్స్ చేస్తుంటాడు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్వీటు తినిపించాలని చూసి వధువు సోదరికి.. ఓ వరుడు సడన్ షాక్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ వరుడు మరీ చిలిపి సుమీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వరడికి, వధువు సోదరికి మధ్య తమాషా సంఘటన చోటు చేసుకుంది. బంధువుల సమక్షంలో వధువు సోదరి.. (bride's sister tried to feed groom rasagulla) వరుడికి రసగుల్లా తినిపించాలని చూస్తుంది. స్పూన్‌తో తీసుకుని అతడికి తినిపించేందుకు ప్రయత్నించగా.. వరుడు మాత్రం నోరు తెరవడు.
Viral Funny Video: రైలు గేటేసినా తగ్గేదేలే.. ఎలా దాటేశాడో చూస్తే.. కళ్లు తేలేస్తారు..
అయినా ఆమె మాత్రం ఎంతో ఓపికగా నోటి వద్ద స్వీటు పట్టుకుని ఉంటుంది. స్వీటు తినాలని పక్కన ఉన్న వారు ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను మాత్రం స్వీటు తినకుండా భీష్మించుకుంటాడు. అయినా ఆమెలో మాత్రం కాస్త కూడా చికాకు పడకుండా అలాగే స్పూను పట్టుకుని ఉంటుంది. చాలా సేపటి తర్వాత వరుడు ఆ స్వీటును టక్కున నోటితో లాక్కుంటాడు. కళ్లు తెరిచి, మూసేలోగా ఆ స్వీటును నోటిలోకి లాగేసుకుంటాడు. వరుడు చేసిన ఈ పనికి వధువు సోదరి షాక్ అవుతుంది.
Viral Video: స్కూటీపై వెళ్తున్న మహిళ.. వెనుక పిల్లాడిని గమనించిన బైకర్.. సమీపానికి వెళ్లి చూడగా..
కాసేపటి తర్వాత షాక్ నుంచి తేరుకుని నవ్వుకుంటుంది. ఇలా ఆ వరుడు విచిత్రంగా ప్రవర్తించి, అందరినీ నవ్వించాడన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వరుడు మహా చిలిపి సుమీ’’.. అంటూ కొందరు, ‘‘మరదలికి భలే షాకిచ్చాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..