Viral Video: ప్రియురాలితో రహస్యంగా హోలీ ఆడిన ప్రియుడు.. రంగులైతే పూశాడు గానీ.. ఆ తర్వాత జరిగింది చూస్తే..
ABN , Publish Date - Mar 07 , 2025 | 07:35 PM
హోలీని పురస్కరించుకుని ఓ యువకుడు తన ప్రియురాలికి రంగులు పూసేందుకు ప్రయత్నించాడు. అయితే నేరుగా వెళ్లే అవకాశం లేకపోవడంతో రహస్యంగా ఇంటి వెనుకకు వెళ్లాడు. రంగులు పూసే క్రమంలో అతను హద్దు మీరేందుకు ప్రయత్నించాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

హోలీ పండుగ సంబరాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. మార్చి 14న హోలీ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం అందరికీ తెలిసిందే. చిన్నాపెద్దా, ఆడామగా తేడా లేకుండా అంతా రంగులు చల్లుకోవడం, ఉట్టి కొట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం చూస్తుంటాం. మరోవైపు బావా మరదళ్లు, ప్రేమికులు.. ఒకరిపై మరొకరు రంగులు చల్లాలని ప్రయత్నించే ఘటనలు కొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ప్రియురాలితో రహస్యంగా హోలీ ఆడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హోలీని పురస్కరించుకుని ఓ యువకుడు తన ప్రియురాలికి రంగులు పూసేందుకు ప్రయత్నించాడు. అయితే నేరుగా వెళ్లే అవకాశం లేకపోవడంతో రహస్యంగా (Young man secretly played Holi with girlfriend) ఇంటి వెనుకకు వెళ్లాడు. ప్రహరీ గోడకు ఇటువైపు అతను నిలబడి ఉండగా.. అవతలి వైపు అతడి ప్రియురాలు నిలబడి ఉంది.
Viral Funny Video: రైలు గేటేసినా తగ్గేదేలే.. ఎలా దాటేశాడో చూస్తే.. కళ్లు తేలేస్తారు..
ఇలా ఒకరికొకరు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న ఘటన అందరికీ తెగ నవ్వ తెప్పించింది. రంగులు పూసిన యువకుడు.. అంతటితో ఆగకుండా ఆమెకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ప్రహరీ గోడను పట్టుకుని ఆమెకు ముద్దు పెడుతుండగా సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. యువతి పక్కనే ఉన్న మహిళ అతడిని గట్టిగా చెంపదెబ్బ కొట్టింది. దెబ్బకు షాకైన యువకుడు.. అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంకోసారి హోలీ ఆడాలంటేనే దడ పుట్టేలా చేసిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఫర్‌ఫెక్ట్ టైమింగ్.. ఫర్‌ఫెక్ట్ పంచ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 89 వేలకు పైగా లైక్‌లు, 2.4 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: స్కూటీపై వెళ్తున్న మహిళ.. వెనుక పిల్లాడిని గమనించిన బైకర్.. సమీపానికి వెళ్లి చూడగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..