Viral Video: స్ప్రే కొట్టాలని వెళ్లి చివరకు ఫూల్ అయ్యాడుగా.. ఈ బాలుడి పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:15 PM
ఓ కార్యక్రమంలో అంతా సరదాగా మాట్లాడుకుంటుండగా.. ఓ బాలుడు చేతిలో స్నో స్ప్రే బాటిల్ పట్టుకుని నిల్చుని ఉంటాడు. దాన్ని ఎవరో ఒకరిపై కొట్టి సరదా తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే చివరకు జరిగిన ఘటన.. అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది..

కళ్ల ముందు ఏ చిన్న వినూత్న ఘటన జరిగినా.. క్షణాల్లో అది వీడియోగా మారి ప్రపంచాన్నే చుట్టేస్తోంది. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలను చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి నవ్వు తెప్పించే వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బాలుడు తనకు ఎదురుగా ఉన్న వ్యక్తిపై స్ప్రే కొట్టాలని చూశాడు. అయితే చివరకు ఏమైందో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఏదో చేయాలని చూస్తే చివరకు ఇంకేదో అయ్యిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో అంతా సరదాగా మాట్లాడుకుంటుండగా.. ఓ బాలుడు చేతిలో స్నో స్ప్రే బాటిల్ పట్టుకుని నిల్చుని ఉంటాడు. దాన్ని ఎవరో ఒకరిపై కొట్టి సరదా తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇంతలో ఎదురుగా ఓ వ్యక్తి పక్కన వారితో సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తాడు. అతడిపై స్ప్రే కొట్టాలని మెల్లగా సమీపానికి వెళ్తాడు.
Viral Funny Video: రైలు గేటేసినా తగ్గేదేలే.. ఎలా దాటేశాడో చూస్తే.. కళ్లు తేలేస్తారు..
అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. తీరా అతడిపై స్ప్రే కొట్టే సమయంలో (Boy tries to spray another man) నాజిల్ రివర్స్‌లో ఉంటుంది. దీంతో స్ప్రే కొట్టగానే అందులోని స్నో మొత్తం బాలుడి ముఖంపైనే పడుతుంది. స్ప్రే కొట్టేందుకు ప్రయత్నించడంతో ఎదురుగా ఉన్న వ్యక్తి.. చేయి అడ్డు పెట్టుకుంటాడు. అయితే స్నో మొత్తం ఆ పిల్లాడి పైనే పడడంతో చివరకు అతడితో పాటూ అక్కడున్న వారంతా నవ్వుకుంటారు.
Viral Video: వీళ్లు మనుషులేనా.. లారీ డ్రైవర్ మంటల్లో కాలుతున్నా.. ఏం చేస్తున్నారో చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏదో చేయాలని చూస్తే చివరకు ఇంకేదో జరిగిందిగా’’.. అంటూ కొందరు, ‘‘దేన్ని ఎలా వాడాలో తెలీకపోతే.. చివరకు ఇలాగే అవుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ప్రాంక్ చేసే ముందు ఆలోచించడం బెటర్.. ఈ యువకుడి పరిస్థితి ఏమైందో చూస్తే.. అవాక్కవుతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..