Viral Video: మనోళ్ల భక్తి అట్లుంటది మరి.. ఆలయంలో దేనికి పూజలు చేస్తున్నారో చూస్తే..
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:36 PM
ఓ ఆలయంలో చాలా మంది భక్తులు క్యూలో వెళ్తుంటారు. మధ్యలో కనిపించే విగ్రహాలకు బొట్టు పెడుతూ దండం పెట్టుకుంటుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది..

పూజల విషయంలో భారతీయుల భక్తిశ్రద్ధలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ గుడి కనిపించినా, ఏ రాయికి కుంకుమ కనిపించినా చేతులో నమస్కరించడం సర్వసాధారణం. కొందరు పూలు, పళ్లు సమర్పించి టెంకాయలు కూడా కొడుతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆలయంలో కొందరు పూజలు చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘మనోళ్ల భక్తి అట్లుంటది మరి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఆలయంలో చాలా మంది భక్తులు క్యూలో వెళ్తుంటారు. మధ్యలో కనిపించే విగ్రహాలకు బొట్టు పెడుతూ దండం పెట్టుకుంటుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది.
క్యూలో వస్తుండగా మధ్యలో ఉన్న ఓ పెద్ద స్పీకర్‌పై కొందరు కుంకుమ పోశారు. దీన్ని చూసిన మిగతా వారు అక్కడ దేవుడి విగ్రహమేమో అనుకుని దానిపై పూలు, కుంకుమ పెడుతూ నమస్కరిస్తున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు స్పీకర్‌కు దండాలు (Devotees worshipping the sound box) పెట్టడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్ల భక్తిశ్రద్ధలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘కుంకుమ కనిపిస్తే పూజలు చేయడం మన నైజం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1900కి పైగా లైక్‌లు, 52 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: నాతో చోరీ అంత ఈజీ కాదు.. దొంగకు ఎలా షాక్ ఇచ్చిందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..