Viral Video: నాతో చోరీ అంత ఈజీ కాదు.. దొంగకు ఎలా షాక్ ఇచ్చిందో చూడండి..
ABN , Publish Date - Mar 08 , 2025 | 03:56 PM
ఓ మహిళ రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటుంది. అయితే అదే సమయంలో ఇద్దరు దొంగలు బైకుపై అటుగా వస్తారు. యువతి ఒంటరిగా నడుస్తూ వెళ్లడాన్ని చూసిన వారు సమీపానికి వెళ్తారు. ఆమె పర్సు లాక్కోవాలని చూడగా.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ఒంటరిగా బయటికి వెళ్లిన మహిళ.. క్షేమంగా ఇంటికి చేరుకునే పరిస్థితులు లేని రోజులివి. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. మరికొందరు నగలు, నగదును దోపీడీ చేయడం, ఇంకొందరు శాడిస్టులు వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొందరు తీవ్రంగా ప్రతిఘటిస్తుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు దొంగలు ఒంటరిగా ఉన్న యువతి చేతిలోని పర్సు దోచుకోవాలని ప్రయత్నించారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటుంది. అయితే అదే సమయంలో ఇద్దరు దొంగలు బైకుపై అటుగా వస్తారు. యువతి ఒంటరిగా నడుస్తూ వెళ్లడాన్ని చూసిన వారు సమీపానికి వెళ్తారు. వారిలో ఓ దొంగ బైకు దిగి ఆమె వద్దకు వెళ్లి పర్సు (Thief tried steal young woman's purse) లాక్కెళ్లాలని ప్రయత్నిస్తాడు.
అయితే దొంగ సమీపానికి రాగానే ఆమె వెంటనే అప్రమత్తమవుతుంది. తన పర్సులోంచి తుపాకీ బయటికి తీసి గాల్లోకి కాల్పులు జరుపుతుంది. ఆమె చేతిలో తుపాకీ చూడగానే అతను భయంతో ఒక్కసారిగా పరుగందుకుంటాడు. అయినా ఆమె వదలకుండా రెండు, మూడు రౌండ్లు గాల్లోకి (young woman fired the gun) కాల్పులు జరుపుతుంది. ఈ ఘటనలో సదరు దొంగ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎలాగోలా అక్కడి నుంచి బయటపడతాడు.
Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న ఎలుకను 20 సెకన్లలో కనుక్కుంటే.. మీకు దృష్టి లోపం లేనట్లే..
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దొంగలకు చుక్కలు చూపించిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ యువతి ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా లైక్‌లు, 16 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: స్కూటీపై వెళ్తున్న మహిళ.. వెనుక పిల్లాడిని గమనించిన బైకర్.. సమీపానికి వెళ్లి చూడగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..