Viral Video: దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న వ్యక్తి.. మెల్లగా సమీపానికి వచ్చిన పులి.. చివరకు జరిగింది చూస్తే..
ABN , Publish Date - Mar 08 , 2025 | 06:27 PM
ఓ వ్యక్తి రాత్రి వేళ తన ఇంటి బయట పడుకుని ఉంటాడు. దుప్పటి కప్పుకున్న అతను గాఢనిద్రలో ఉండగా.. అర్ధరాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద పులి మెల్లగా అతడి మంచం వద్దకు వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

జనారణ్యంలోకి వణ్యప్రాణులు రావడం తరచూ జరుగుతుంటుంది. ఏనుగులు, పులులు, సింహాలు.. నివాస ప్రాంతాల్లోకి వచ్చి బీభత్సం హల్‌చల్ చేస్తుంటాయి.ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడే పులులు తెలివిగా కోళ్లు, కుక్కలను ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి దుప్పటి కప్పుకొని నిద్రపోతుండగా.. ఓ పెద్ద పులి మెల్లగా సమీపానికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రాత్రి వేళ తన ఇంటి బయట పడుకుని ఉంటాడు. దుప్పటి కప్పుకున్న అతను గాఢనిద్రలో ఉండగా.. అర్ధరాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి స్థానిక ప్రాంతానికి చేరుకున్న పుద్ద పులి.. నేరుగా ఆ వ్యక్తి ఇంటి ఆవరణలోకి వచ్చేసింది.
Viral Video: అదృష్టం అడ్డం తిరిగితే ఇలాగే అవుతుంది.. ఈ వైల్డ్ బీస్ట్‌కు ఏమైందో చూడండి..
మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వ్యక్తి మంచం వద్దకు వచ్చింది. అతడిపై దాడి చేస్తుందేమో అని అంతా అనుకుంటారు. అయితే దూరం నుంచి మంచం పక్కన పడుకున్న కుక్కను టార్గెట్ చేసి పులి.. దాని వద్దకు చేరుకుంటుంది. సమీపానికి రాగానే ఒక్కసారిగా కుక్క మెడ పట్టుకుని,(Tiger attacking dog) బయటికి లాక్కెళ్లిపోతుంది. కుక్క అరుపులతో నిద్రలేచిన ఆ వ్యక్తి.. పులి వెళ్లిన వైపు పరుగెత్తుకుంటూ వెళ్తాడు. అంతలోనే మరికొంతమంది పరుగెత్తుకుంటూ అటువైపు వెళ్లిపోతారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
Viral Video: మనోళ్ల భక్తి అట్లుంటది మరి.. ఆలయంలో దేనికి పూజలు చేస్తున్నారో చూస్తే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ పులి ఎంతో తెలివిగా దాడి చేసిందిగా’’.. అంటూ కొందరు, ‘‘అతడి టైం బాగుంది.. లేకుంటే ప్రాణాలే పోయేవి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 76 వేలకు పైగా లైక్‌లు, 3.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: నాతో చోరీ అంత ఈజీ కాదు.. దొంగకు ఎలా షాక్ ఇచ్చిందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..