Tricks Viral Video:కుళాయికి పైపు తగిలించడం ఇంత ఈజీనా.. ఈ ట్రిక్ ఏదో అదిరిందిగా..
ABN , Publish Date - Mar 08 , 2025 | 08:53 PM
కొళాయికి పైపు తగిలించే క్రమంలో చాలా మంది తెగ ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు పైపును కొళాయికి ఎక్కించడంలో ఇబ్బంది తలెత్తితే.. మరికొన్నిసార్లు అది ఊడిపోకుండా చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. అయితే ఈ వ్యక్తి సింపుల్ ట్రిక్‌తో సమస్యకు చెక్ పెట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు..

సూక్ష్మంలోనే మోక్షం ఉందని పెద్దలు అంటుంటారు. ఇందుకు తగ్గట్టుగా కొందరు సింపుల్ ట్రిక్స్ వాడి వివిధ రకాల పనులను ఎంతో సులభంగా చేసేస్తుంటారు. అదే పనులను చాలా మంది ఎంతో కష్టపడి చేస్తుంటారు. అయితే ఇలాంటి ట్రిక్స్ చూసినప్పుడు.. ‘‘అరే.. ఈ పని చేయడం ఇంత ఈజీనా’’.. అని అనిపిస్తుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కొళాయికి పైపును తగిలించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘కుళాయికి పైపు తగిలించడం ఇంత ఈజీనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొళాయికి పైపు తగిలించే క్రమంలో చాలా మంది తెగ ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు పైపును కొళాయికి ఎక్కించడంలో ఇబ్బంది తలెత్తితే.. మరికొన్నిసార్లు అది ఊడిపోకుండా చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది.
Dog Viral video: నీళ్లలోకి వెళ్లిన కుక్క పిల్ల..సెకన్ల వ్యవధిలో షాకింగ్ సీన్.. చివరకు..
అయితే ఈ సమస్యకు ఓ వ్యక్తి సింపుల్ చిట్కా కనిపెట్టాడు. పైపును కొళాయికి తొడిగిన తర్వాత.. దాని చుట్టూ ఓ ఇనుక తీగను చుట్టి మధ్యలో రింగ్‌లా చేశాడు. తర్వాత అందులో స్క్రూడ్రైవర్ పెట్టి దానికి (Attaching Pipe to Tap) రెండు వైపులా మిగిలిన తీగను చుట్టేస్తాడు. చివరగా దాన్ని గట్టిగా తిప్పేస్తాడు. ఇలా బిగుతుగా తిప్పిన తర్వాత రింగ్ మధ్యలో నుంచి స్క్రూడ్రైవర్‌ను తీసేస్తాడు. ఇలా పైపును ఇనుప తీగ సాయంతో సింపుల్‌గా బిగించేస్తాడన్నమాట.
Drunken Woman Video: ఇద్దరు యువకుల మధ్యలో యువతి.. బైక్‌పై ఆమె నిర్వాకం చూసి వాహనదారుల షాక్..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే.. ఈ ట్రిక్ ఏదో చాలా బాగుందే’’.. అంటూ కొందరు, ‘‘కొళాయికి పైపును ఇంత సులభంగా తగిలించొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 లక్షలకు పైగా లైక్‌లు, 67 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..