Dog Viral video: నీళ్లలోకి వెళ్లిన కుక్క పిల్ల..సెకన్ల వ్యవధిలో షాకింగ్ సీన్.. చివరకు..
ABN , Publish Date - Mar 08 , 2025 | 07:54 PM
ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా బాగున్న వారు అంతలోనే మృత్యుఒడిలోకి జారుకుంటుంటారు. జంతువుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీటిలోకి వెళ్లిన కుక్క పిల్ల.. సడన్‌గా ఎలా చనిపోయిందో చూసి అంతా షాక్ అవుతున్నారు..

ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా బాగున్న వారు అంతలోనే మృత్యుఒడిలోకి జారుకుంటుంటారు. జంతువుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. కొన్నిసార్లు కొన్ని జంతువుల ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ కుక్క పిల్ల వీడియో తెగ వైరల్ అవుతోంది. నీటిలోకి వెళ్లిన కుక్క పిల్ల.. ఎలా చనిపోయిందో చూసి అంతా షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. నీటిలోని మొసళ్ల దాడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటికి సమీపానికి ఎలాంటి జంతువు వెళ్లినా కూడా ఇట్టే వాటికి నోటికి చిక్కాల్సిందే. ఒక్కసారి వాటి నోటికి చిక్కితే ఇక ప్రాణాలతో బయటపడడం అసాధ్యం. తాజాగా, ఓ కుక్క పిల్లకు ఇలాంటి పరిస్థితి రావడం చూసి అంతా అయ్యో పాపం అని అంటున్నారు.
Drunken Woman Video: ఇద్దరు యువకుల మధ్యలో యువతి.. బైక్‌పై ఆమె నిర్వాకం చూసి వాహనదారుల షాక్..
నీటి ఒడ్డున ఉన్న కుక్క పిల్ల చివరకు పరుగెత్తుతూ నీటిలోకి వెళ్లింది. అయితే ఇలా నీటిలోకి వెళ్లగానే ఓ పెద్ద మొసలి ఒక్కసారిగా నీటిపైకి వచ్చి, (Crocodile attacks puppy) చూస్తుండగానే కుక్కపిల్లను నోట కరుకుచుకుంది. మొసలి దాడితో విలవిల్లాడిపోయిన కుక్క పిల్ల.. ఎలాగైనా దాన్నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించింది. అయితే మొసలి దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లిపోయింది. అక్కడే ఉన్న మరో కుక్క పిల్ల దీన్ని గమనించి తన మిత్రుడిని కాపాడేందుకు పరుగెత్తుతూ వెళ్లింది.
అయితే అప్పటికే మొసలి నీటిలోకి వెళ్లిపోవడంతో ఆ కుక్క పిల్ల కొద్ది సేపు అక్కడే నిలబడి, తర్వాత వెనక్కు వెళ్లిపోయింది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడియో తీస్తున్న వారు కుక్క పిల్ల అటు వెళ్లకుండా అడ్డుకోవచ్చుగా’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. పాపం.. ఈ కుక్కపిల్లను చూస్తుంటే ఎంతో బాధగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లు, 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: అదృష్టం అడ్డం తిరిగితే ఇలాగే అవుతుంది.. ఈ వైల్డ్ బీస్ట్‌కు ఏమైందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..