Share News

Pakistan Train Video: అది రైలా.. లేక చెత్తకుండీనా.. చూస్తే కళ్లు తేలేయాల్సిందే..

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:03 PM

ఓ వ్యక్తి పాకిస్తాన్ రైల్లో ప్రయాణిస్తూ లోపలి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. రైల్లో కొంత మంది సీట్లలో కూర్చుని ఉండగా.. మరికొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే చివరకు అక్కడి దృశ్యాలు చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

Pakistan Train Video:  అది రైలా.. లేక చెత్తకుండీనా.. చూస్తే కళ్లు తేలేయాల్సిందే..

పాకిస్తాన్‌‌కు సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తమ దేశంలో నెలకొన్న అధ్వాన పరిస్థితిని తెలియజేస్తూ స్థానికులు గతంలో అనేక రీల్స్ చేయడం చూశాం. పాక్‌పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సందర్భంలో పాకిస్తానీయులు బొమ్మ యుద్ధ విమానాలు, రాకెట్స్‌తో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరినీ తెగ నవ్వించడం కూడా చూశాం. తాజాగా, ఓ వ్యక్తి పాకిస్తాన్ రైల్లోని పరిస్థితిని వివరిస్తూ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. అది రైలా.. లేక చెత్తకుండీనా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పాకిస్తాన్ రైల్లో (Pakistan Railways) ప్రయాణిస్తూ లోపలి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. రైల్లో కొంత మంది సీట్లలో కూర్చుని ఉండగా.. మరికొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. దగ్గరికి వెళ్లి చూడగా ఆ సీట్లు మొత్తం పాడైపోయాయి.


సీట్ల కింద చెత్తాచెదారం గుట్టలుగా (Garbage under train seats) పేరుకుపోవడంతో పాటూ రంధ్రాలు పడి దెబ్బతింది. బోగీ మొత్తం ఇవే దృశ్యాలు కనిపించాయి. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న రైలును నడపడంపై ఆ వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇది రైలా లేక చెత్తకుండీనా’.., ‘ఇది కదా పాకిస్థాన్ సూపర్ పవర్ అంటే’.., ‘1947 నాటి భారతదేశ రైలును.. పాకిస్తాన్ వాళ్లు ఇప్పటికీ వాడుతున్నారు’.., ‘ఇలాంటి అద్భుతాలు పాక్‌లోనే సాధ్యం’.. అంటూ కొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 98 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 12:06 PM