Share News

Desi Jugaad Viral Video: దీని ముందు ఏసీ కూడా దిగదుడుపే.. ఈ కారు డ్రైవర్ తెలివి చూస్తే..

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:10 PM

ఓ వ్యక్తి కారులో రయ్యిన దూసుకెళ్తున్నాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. కారులో వెళ్లడంలో విశేషమేమీ లేకున్నా కారులో అతను చేసుకున్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.

Desi Jugaad Viral Video: దీని ముందు ఏసీ కూడా దిగదుడుపే.. ఈ కారు డ్రైవర్ తెలివి చూస్తే..

కొందరు వాహనాలను వాడే విధానం అందరికీ భిన్నంగా ఉంటుంది. మరికొందరు తమ వాహనాల్లో వింత వింత ఏర్పాట్లు చేసుకోవడం చూస్తుంటాం. కారును హెలీకాప్టర్‌గా మార్చేవారు కొందరైతే.. మరికొందరు బైకులను కార్లలా మార్చి అందరినీ ఆశ్చపరుస్తుంటారు. ఇంకొందరు వాహనాల్లో చేసే చిన్న చిన్న మార్పులు.. చూపరులను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన కారులో చల్లగాలి వచ్చేందుకు చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. కారు డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో రయ్యిన దూసుకెళ్తున్నాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. కారులో వెళ్లడంలో విశేషమేమీ లేకున్నా కారులో అతను చేసుకున్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. కారులో చల్లగాలి కోసం ఎవరైనా ఏసీ ఆన్ చేసుకుంటారు. ఏసీ లేని వారు గ్లాస్ ఓపెన్ చేసుకుంటారు. అయితే ఇతను ఈ రెండు పనులూ చేయకుండా చల్లగాలిని ఆస్వాదిస్తూ డ్రైవింగ్ చేశాడు.


ఇందుకోసం ఓ ప్లాస్టిక్ పైపును తీసుకుని డ్రైవింగ్ సీటు పక్కన (Pipe fitting for car door) ఉండే డోరుకు అమర్చాడు. పైపు ఓ చివర గాలిలో ఉండేలా, మరో చివర కారు లోపల ఉండేలా సెట్ చేశాడు. ఫైనల్‌గా కారు దూసుకెళ్తుండగా.. గాలి పైపు గుండా లోపలికి వస్తోంది. ఈ గాలి స్వచ్ఛంగా ఉండడమే కాకుండా చల్లగా ఉండడంతో ఆ డ్రైవర్ ఎంజాయ్ చేస్తూ డ్రైవింగ్ చేయసాగాడు. ఇలా ఆ వ్యక్తి చల్లగాలి కోసం చేసిన విచిత్ర ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ కారు డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘హోమ్ మేడ్ ఏసీ.. సూపర్’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1700కి పైగా లైక్‌లు, 68 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 01:10 PM