Share News

Bear Viral Video: ఎలుగుబంటిని చూసి నీళ్లలోకి దూకేసిన మందుబాబు.. చివరకు జరిగింది చూస్తే..

ABN , Publish Date - Aug 03 , 2025 | 10:38 AM

చాలా మంది పర్యాటకులు జూలో జంతువులను సందర్శిచేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ 23 ఏళ్ల వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి జూలోకి వెళ్లాడు. వెళ్లన వాడు జంతువులను చూసి తిరిగిరాకుండా.. అత్యుత్సాహంతో ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Bear Viral Video: ఎలుగుబంటిని చూసి నీళ్లలోకి దూకేసిన మందుబాబు.. చివరకు జరిగింది చూస్తే..
Bear Tried to Attack Drunken Man

జూలలో జంతువులను చూసే క్రమంలో కొందరు ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తుంటాం. పులులు, సింహాల సమీపానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు కొందరైతే.. మరికొందరు అదృష్టవశాత్తు త్రుటిలో తప్పించుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ఓ వ్యక్తి.. దాన్నుంచి తప్పించుకునే క్రమంలో నీళ్లలోకి దూకేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పోలాండ్‌లోని వార్సా జూలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. చాలా మంది పర్యాటకులు జూలో జంతువులను సందర్శిచేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ 23 ఏళ్ల వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి జూలోకి వెళ్లాడు. వెళ్లన వాడు జంతువులను చూసి తిరిగిరాకుండా.. అత్యుత్సాహంతో (Drunk man jumps into bear enclosure) ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు. ఎలుగు సమీపానికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.


అయితే ఈ క్రమంలో ఎలుగుబంటి అతడిపైకి (Bear Chased The Drunken Man) దాడి చేసేందుకు వెళ్లింది. ఎలుగుబంటి తన వైపు కోపంగా రావడం చూసి అతను వెంటనే నీళ్లలోకి దూకేశాడు. అయినా వదలని ఆ ఎలుగు.. తర్వాత నీళ్లలోకి దూకి అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఎలుకు నీళ్లలోకి దూకగానే అతను ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఎలుగుబంటి తలపై చేయి పెట్టి నీళ్లలో ముంచేశాడు. అది పైకి లేచే అవకాశం ఇవ్వకుండా నీళ్లలో ముంచుతూనే ఉన్నాడు.


మధ్యలో తేరుకున్న ఎలుగుబంటి అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయినా అతను ఎలాగోలా దాన్ని దూరంగా తోసేశాడు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది స్పందించి, అతన్ని రక్షించినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మందుబాబు పెద్ద యుద్ధమే చేశాడుగా’.. అంటూ కొందరు, ‘ఇతడి టైం బాగుంది కాబట్టి.. బతికిబట్టకట్టగలిగాడు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా లైక్‌లు, 2.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 10:38 AM