Funny Viral Video: ప్రపంచంలోనే ఘాటైన కూర.. తిన్న వారి పరిస్థితి ఏమైందో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Jun 28 , 2025 | 06:46 PM
ఓ రెస్టారెంట్ యాజమాన్యం స్పైసీ ఫుడ్ ప్రియులకు ఓ ఛాలెంజ్ విసిరింది. తమ హోటల్లో ప్రత్యేకంగా తయారు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఘాటైన కూరను (రూ.2500) 15 నిముషాల్లో తింటే హోటల్లో ఏ భోజనమైనా ఉచితంగా అందిస్తాం.. అంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో చాలా మంది ఆహార ప్రియులు.. ఆ హోటల్‌కు క్యూ కడుతున్నారు. అయితే..

ప్రపంచంలో అనేక రకాల ఆహార పదార్థాలను చూస్తుంటాం. పాముల ఫ్రై, కప్పల వేపుడు, గబ్బిలాల కర్రీ.. ఇలా చిత్రవిచిత్రమైన ఆహారాలను వివిధ దేశాల్లో ప్రత్యేకతను సంతరించుకుంటుంటాయి. ఇలాంటి వంటలకు సబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంటాయి. అయితే తాజాగా, ప్రపంచంలోనే అత్యంత ఘాటైన కూరకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ కూరను తిన్న వారి పరిస్థితి చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇలాంటి కూర కూడా ఉంటుందా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. లండన్‌లోని (London) ఓ రెస్టారెంట్.. స్పైసీ ఫుడ్ ప్రియులకు ఓ ఛాలెంజ్ విసిరింది. తమ హోటల్లో ప్రత్యేకంగా తయారు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఘాటైన కూరను (రూ.2500) 15 నిముషాల్లో తింటే హోటల్లో ఏ భోజనమైనా ఉచితంగా అందిస్తాం.. అంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో చాలా మంది ఆహార ప్రియులు.. ఆ హోటల్‌కు క్యూ కడుతున్నారు. అయితే ఒక్కరు కూడా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయలేకపోయారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు ఈ కూర (Most spiciest curry in the world) తినేందుకు ముందుకొచ్చాడు. అయితే రెండు స్పూన్లు నోట్లో వేసుకోగానే.. కారం నసాలానికి ఎక్కింది.
మంట విపరీతంగా ఉండడంతో సదరు యువకుడు తట్టుకోలేక బయటికి పరుగులు తీశాడు. చివరకు హోటల్ సిబ్బంది.. అతడికి జ్యూస్‌లు ఇచ్చి ఎలాగోలా సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మరో వ్యక్తి కూడా ఈ కూరను తినే సాహసం చేశాడు. ఇతడైతే ముందు వ్యక్తి కంటే నాలుగైదు స్పూన్లు ఎక్కువే తినేశాడు గానీ.. ఆ తర్వాత నోరు మంటెక్కిపోవడంతో.. ‘నా వల్ల కాదు బాబోయ్’.. అంటూ చేతులెత్తేశాడు. ఈ కూరను తినే ముందు హోటల్ యాజమాన్యం.. సదరు కస్టమర్లతో సంతకం కూడా చేయించుకుంటుంది. దీన్ని తిన్న తర్వాత ఏదైనా హాని జరిగితే హోటల్ వారిది బాధ్యత కాదు.. అంటూ సంతకం చేయించుకున్న తర్వాతే.. తినేందుకు అనుమతి ఇస్తారన్నమాట.
అత్యంత ఘాటైన కూరను తయారు చేసేందుకు ఈ హోటల్ వారు ప్రపంచవ్యాప్తంగా దొరికే 72 రకాల ఘాటైన మసాలా దినుసులను వాడారట. నాగ చిల్లీ, బర్డ్స్ ఐ మిర్చీ, బంగ్లాదేశ్‌లో దొరికే స్నేక్ చిల్లీ వంటి ఘాటైన మిరపకాయలను ఈ కూరలో వాడారట. దీంతో ఈ వంటకం ప్రపంచంలోనే అత్యంత ఘాటైనదిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ విచిత్రమైన కూరను తినే ఛాలెంట్ పెట్టడంతో లండన్‌లో సదరు హోటల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ కూరను ఒక్కసారి తింటే.. ఇక జీవితంలో కారమే తినరేమో’.. అంటూ కొందరు, ‘ఇలాంటి కూర కూడా ఉంటుందా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23 వేలకు పైగా లైక్‌లు, 6.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.