Share News

Cow Attack Video: అయ్యో.. ఎంత ఘోరం.. ఈ ఆవులు ఏం చేశాయో చూడండి..

ABN , Publish Date - Jun 27 , 2025 | 09:22 PM

ఓ వృద్ధుడు బైకుపై వచ్చి రోడ్డు పక్కన దిగాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న రెండు ఆవులు.. వృద్ధుడిపైకి దూసుకొచ్చాయి. వచ్చీ రావడంతోనే అతడిపై దాడి చేశాయి. చివరకు దారుణ ఘటన చోటు చేసుకుంది..

Cow Attack Video: అయ్యో.. ఎంత ఘోరం.. ఈ ఆవులు ఏం చేశాయో చూడండి..

కొన్నిసార్లు కామ్‌గా ఉండే జంతువులు కూడా ఉగ్రరూపం దాల్చుతుంటాయి. ఈ క్రమంలో మనుషులపై దాడి చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై ఆవులు బీభత్సం సృష్టించాయి. వృద్ధుడిపై దాడి చేయడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర (Maharashtra) నాసిక్ జిల్లా కల్వన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భల్చంద్ర మల్పురే (79) అనే వృద్ధుడు బైకుపై వచ్చి రోడ్డు పక్కన దిగాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న రెండు ఆవులు.. వృద్ధుడిపైకి దూసుకొచ్చాయి. వచ్చీ రావడంతోనే వృద్ధుడిని నేలపై పడేసి కొమ్ములతో దాడి చేశాయి. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అతన్ని కాపాడాలని ఎంతోప్రయత్నిస్తారు.


కానీ ఎంత కొట్టినా ఆవులు మాత్రం అక్కడి నుంచి కదలకుండా (Cow attacks old man) వృద్ధుడిని తొక్కుతూనే ఉంటాయి. ఈ క్రమంలో చివరకు అంతా కలిసి ఎలాగోలా వృద్ధుడిని పక్కకు లాక్కెళ్లారు. అయినా ఆ ఆవులు అతన్ని వదలకుండా వారిపైకి దూసుకెళ్లి మరీ దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో అడ్డు వచ్చిన మరో వ్యక్తిపై కూడా దాడి చేశాయి. అయితే చివరకు అంతా కలిసి పెద్ద పెద్ద కర్రలతో వాటిని వెంటబడి దూరంగా తరిమికొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మల్పురేను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.


అయితే అతను అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’.. అంటూ కొందరు, ‘ఆవులు ఇలా చేయడం చాలా అరుదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 2 వేలకు పైగా వీక్షించారు.


ఇవి కూడా చదవండి..

మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..

అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 27 , 2025 | 09:22 PM