Share News

Crocodile Viral Video: మొసలిపై గుర్రపు స్వారీ చేశాడు.. చివరకు జరిగింది చూసి ఖంగుతిన్నాడు..

ABN , Publish Date - Jun 27 , 2025 | 08:47 PM

ఓ ట్రైనర్ మొసళ్ల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. అంతా చూస్తుండగానే పెద్ద మొసలిపై కూర్చుని గుర్రపు స్వారీ తరహాలో ఎంజాయ్ చేశాడు. అయితే ఇంతలో ఆ పక్కనే ఉన్న మొసలి అతడి వైపు రావడానికి ప్రయత్నిస్తుంది. దీంతో..

Crocodile Viral Video:  మొసలిపై గుర్రపు స్వారీ చేశాడు.. చివరకు జరిగింది చూసి ఖంగుతిన్నాడు..

పులులు, సింహాలు, మొసళ్లు.. ఈ పేర్లు వింటేనే ఒంట్లో వణుకు పుడుతుంది. అయితే కొందరు మాత్రం వీటితో ఆటలు ఆడుకుంటుంటారు. మరికొందరు మరీ విచిత్రంగా వాటితో గేమ్స్ కూడా ఆడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మొసలిపై గుర్రపు స్వారీ చేశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ట్రైనర్ మొసళ్ల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. అంతా చూస్తుండగానే పెద్ద మొసలిపై కూర్చుని (Man sitting on Crocodile) గుర్రపు స్వారీ తరహాలో ఎంజాయ్ చేశాడు. అయితే ఇంతలో ఆ పక్కనే ఉన్న మొసలి అతడి వైపు రావడానికి ప్రయత్నిస్తుంది. దీంతో అతను వెంటనే మొసలి పైనుంచి లేచి, పక్కకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు.


అయితే అతను పైకి లేవగానే.. అప్పటిదాకా కామ్‌గా ఉన్న మొసలి.. ఒక్కసారిగా (Crocodile Tries to Attack Trainer) అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. చేయి పట్టుకుని కొరికే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆ వ్యక్తి దాన్నుంచి ఎలాగోలా తప్పించుకుని పక్కకు వెళ్లిపోతాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అది మొసలి అనుకున్నావా.. గుర్రం అనుకున్నావా’.. అంటూ కొందరు, ‘ఇతడి టైం బాగుంది.. లేదంటే ప్రాణాలే పోయేవి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా లైక్‌లు, 6.98 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..

అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 27 , 2025 | 09:11 PM