Share News

Cyclone Montha: పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 28 , 2025 | 07:24 PM

తుపాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సహాయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అంశాలపై ఫోకస్‌ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Cyclone Montha: పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు
CM Chandrababu On Cyclone Montha

అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మొంథా తుపాను (Cyclone Montha) ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రాష్ట్ర సచివాలయంలో ఇవాళ(మంగళవారం) మంత్రులు, పలు శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్‌, అనిత, నారాయణ హాజరయ్యారు. తుపాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సహాయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అంశాలపై ఫోకస్‌ పెట్టాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.


తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. డ్రోన్లతో ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని సూచించారు. వాగులు పొంగే అవకాశం ఉన్నచోట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాల్వలు, చెరువులకు గండ్లుపడకుండా పర్యవేక్షణ ఉండా లని మార్గనిర్దేశం చేశారు. లంక గ్రామాల ప్రజలను రిలీఫ్ క్యాంపులకు త్వరితగతిన తరలించాలని సూచించారు సీఎం చంద్రబాబు.


విద్యుత్‌ సరఫరాపై ఫోకస్‌ పెట్టి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆజ్ఞాపించారు. తుపాను తీరం దాటిన తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. అధికారులు - ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయితే, ఈరోజు అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే సీఎం చంద్రబాబు ఉండనున్నారు. మొంథా తీవ్ర తుపాన్‌పై ఎప్పటికప్పుడు అధికారులతో చంద్రబాబు సమీక్షిస్తున్నారు. రెవెన్యూ, ఐటీ, హోంమంత్రి, అధికారులతో ఎప్పుటికప్పుడూ మొంథా తుపాను వివరాలు తెలుసుకుంటున్నారు సీఎం చంద్రబాబు.


ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 07:37 PM