CM Chandrababu On Konaseema: మొంథా తుఫాను ప్రమాదం తప్పింది.. కానీ చాలా నష్టపోయాం..
ABN , Publish Date - Oct 29 , 2025 | 04:40 PM
మొంథా తుఫాను పెను విపత్తు అని, దీని వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిళ్లిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో తుఫాన్‌ల సమయంలో పనిచేసిన అనుభవం తనకుందని గుర్తుచేశారు.
కోనసీమ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను (Cyclone Montha) పెను విపత్తు అని, దీని వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిళ్లిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. గతంలో తుఫాన్‌ల సమయంలో పనిచేసిన అనుభవం తనకుందని గుర్తుచేశారు. మొంథా తుఫాన్‌పై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.
తుఫానుపై ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇవాళ(బుధవారం) కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఓడలరేవులో తుఫాన్ బాధితులను సీఎం పరామర్శించారు. తుఫాన్ బాధితులకు నిత్యావసరాలు, రూ.3వేలు పరిహారం అందజేశారు. మత్స్యకారుల కుటుంబాలకు 50కిలోల బియ్యం అందించారు.
అలాగే, అల్లవరం మండలంలోని బెండమూరులంక రేవులో పడిపోయిన కొబ్బరి చెట్లను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కోనసీమ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో వరి, ఆక్వా, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైందని వెల్లడించారు సీఎం చంద్రబాబు.
ఆస్తి నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. కౌలు రైతులకు పరిహారం అందిస్తామని భరోసా కల్పించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి రూ.3వేలు, రేషన్ సరుకులు ఇస్తున్నామని ప్రకటించారు. మత్స్యకారుల కుటుంబాలకు 50కిలోల బియ్యం అందజేస్తామని చెప్పుకొచ్చారు. సాధారణ కుటుంబాలకు 25కిలోల బియ్యం, నిత్యావసరాలు అందజేస్తామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
ఈ వార్తలు కూడా చదవండి...
రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవి: మంత్రి సత్యకుమార్
బాహుదా నదికి పోటెత్తిన వరద.. ఇచ్ఛాపురం జలదిగ్భంధం
Read Latest AP News And Telugu News