MP DK Aruna: ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ చేయించాలి: ఎంపీ డీకే అరుణ
ABN , Publish Date - Jun 25 , 2025 | 02:52 PM
ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి ప్రజలందరికీ తెలియాలని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నాడు పేదలపై అరాచకాలు చేశారని.. ఈనాడు సామాజిక న్యాయం అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు.

నల్లగొండ: స్థానిక సంస్థలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్‌కి లేదని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) అన్నారు. రెండు ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా ఇంకా రాలేదని.. అలాంటప్పుడు రైతు భరోసా పేరుతో సంబురాలు ఎందుకు చేసుకుంటున్నారో కాంగ్రెస్ నేతలకే తెలియదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌లో బీజేపీ నాయకులందరూ బాధితులేనని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్ ప్రభుత్వం ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ చేయించాలని కోరారు. ఇవాళ(బుధవారం) నల్లగొండలో ఎంపీ డీకే అరుణ పర్యటించారు. బీజేపీ నేతలతో పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. జూన్ 25వ తేదీ దేశ చరిత్రలో చీకటి రోజని తెలిపారు ఎంపీ డీకే అరుణ.
ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి ప్రజలందరికీ తెలియాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆనాడు పేదలపై అరాచకాలు చేశారని.. ఈనాడు సామాజిక న్యాయం అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తన అజెండాను దేశంపై రుద్దేందుకు రాజ్యాంగ సవరణలు చేపట్టిందని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రపంచ వ్యాప్తంగా లభిస్తోన్న ఖ్యాతిని చూసి రాహుల్ గాంధీ ఓర్వలేక పోతున్నారని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత శక్తి ఏంటో పాకిస్థాన్‌కి చూపించామని తెలిపారు. ప్రధానిని విమర్శించే సీఎం రేవంత్‌రెడ్డి ఎమర్జెన్సీ గురించి ముందుగా మాట్లాడాలని ఎంపీ డీకే అరుణ హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
జూలై ఒకటి నుంచి రైల్వే చార్జీలు స్వల్పంగా పెంపు
Read Latest Telangana News and National News