Renuka Chowdary: రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:50 PM
మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. రేణుకా చౌదరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని న్యాయస్థానం కొట్టివేసింది. 2014 సంవత్సరంలో వైరా ఎమ్మెల్యే టికెట్ తమకు (భూక్య రాంజీ సతీమణి కళావతి తనకు లేదా తన భర్తకు) ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే రేణుకాకు బిగ్ రిలీఫ్ లభించింది.

ఖమ్మం జిల్లా: మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి (Renuka Chowdary) ఖమ్మం కోర్టులో (Khammam Court) ఊరట లభించింది. రేణుకా చౌదరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని న్యాయస్థానం కొట్టివేసింది. 2014 సంవత్సరంలో వైరా ఎమ్మెల్యే టికెట్ తమకు (భూక్య రాంజీ సతీమణి కళావతికి లేదా ఆమె భర్తకు) ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు న్యాయస్థానాన్ని కళావతి ఆశ్రయించారు. ఈ కేసుపై ఖమ్మం జిల్లా కోర్టులోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. నేరం రుజువు కాకపోవడంతో ఇవాళ (జులై11, శుక్రవారం) కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. రేణుకా చౌదరి తరఫున సీనియర్ న్యాయవాదులు ఎం.నిరంజన్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డి ఈ కేసుని వాదించారు.
జిల్లా కోర్టు వద్ద నుంచి భారీ ర్యాలీతో జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి రేణుకా చౌదరి చేరుకున్నారు. ఆమెకి అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేణుకా చౌదరి మాట్లాడారు. తన 62సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ కోర్టు కేసు మొదటిదని చెప్పుకొచ్చారు. నిజం అనేది ఎప్పటికైనా నిరూపితం అవుతుందని అన్నారు. నాలుగు రోజుల్లో తన గేమ్ స్టార్ట్ చేస్తానని.. ఒక్కొక్కరిని అటాడిస్తానని హెచ్చరించారు. అసలు తనపై ఈ కేసు వేయించిన వారు ఎవరో.. వారి సంగతి చెబుతానని వార్నింగ్ ఇచ్చారు రేణుకా చౌదరి.
కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి..
మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నారని.. ఆయన ఆరోగ్యం బాగుండాలని రేణుకా చౌదరి కోరుకున్నారు. కేసీఆర్ అబ్బాయి, అమ్మాయి, అల్లుడుగార్లు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారోనని పరోక్షంగా కేటీఆర్, కవిత, హరీష్‌రావులని విమర్శించారు. తెలంగాణ యువ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని ఉద్ఘాటించారు. ఎమ్మెల్సీ కవిత మీ నాయన దగ్గర ఏం మాట్లాడావని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని.. తనకు చాలా గర్వంగా ఉందని కొనియాడారు రేణుకా చౌదరి.
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి రేణుకా చౌదరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాబోయే, స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగాల్లో బీసీలకు అవకాశాలు పెరుగుతాయని ఉద్గాటించారు. సమసమాజ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఉద్ఘాటించారు. అందరికీ సమాన న్యాయం, సమాన అవకాశాలు కాంగ్రెస్ నినాదమని అభివర్ణించారు. కాంగ్రెస్ విధానాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పాలనని చూసి ఓర్వలేకపోతున్నారని రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
హెచ్‌సీఏ స్కాంలో దూకుడు పెంచిన సీఐడీ
భద్రాద్రి రామయ్య భూముల కబ్జాపై కేటీఆర్ రియాక్షన్
Read Latest Telangana News And Telugu News