Share News

Mallu Bhatti Vikramarka: టీ బీజేపీ చీఫ్ రామ్ చందర్‌రావుకి భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Jul 22 , 2025 | 07:02 PM

తెలంగాణ కులగణన, రిజర్వేషన్లు దేశానికి దశ దిశ చూపుతాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. బీసీ సర్వే మొదలు పెట్టినప్పుడు కొంతమంది అవసరం లేదన్నారని తెలిపారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన సర్వే నిదర్శనంగా నిలిచిందని నొక్కిచెప్పారు.

Mallu Bhatti Vikramarka: టీ బీజేపీ చీఫ్ రామ్ చందర్‌రావుకి భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్
BJP VS Congress

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామ్ చందర్‌రావుకు (T BJP Chief Ram Chandra Rao) ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రామ్ చందర్‌ రావు భట్టికి పంపించిన లీగల్ నోటీస్‌లపై ఆయన స్పందించారు. లీగల్ నోటీస్‌లకు తాను భయపడేవాడిని కాదని.. ఆయన ఇచ్చిన నోటీస్‌లకు సమాధానం చెబుతానని తెలిపారు. ఇవాళ(మంగళవారం) తెలంగాణ సచివాలయంలో మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రామచందర్‌రావుకు దళిత బహుజనులంటే చిన్నచూపు ఉందని ధ్వజమెత్తారు. వారికి మేలుచేసే పనులకు అడ్డు తగలడం బీజేపీ అధ్యక్షుడికి బాగా అలవాటని మండిపడ్డారు మల్లు భట్టి విక్రమార్క.


హెచ్‌సీయూ ఘటనలో ఆయన పాత్ర కూడా ఉందని అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్లు మీరే చెప్పారు మీరే చేయాలని అనడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీలో తీర్మానం చేయాలని తాము అడగటం లేదని.. కేంద్రప్రభుత్వం చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని.. ఆయనకు ఈ విషయం సరిగా అర్థం కానట్లు ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ కులగణన, రిజర్వేషన్లు దేశానికి దశ దిశ చూపుతాయని ఉద్ఘాటించారు. బీసీ సర్వే మొదలు పెట్టినప్పుడు కొంతమంది అవసరం లేదన్నారని.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన సర్వే నిదర్శనంగా నిలిచిందని నొక్కిచెప్పారు మల్లు భట్టి విక్రమార్క.


గతంలో కుల గణన అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్‌లో చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణలో సర్వే జరిగాక దేశవ్యాప్తంగా జరపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ సర్వేను సమర్థించారని ఉద్ఘాటించారు. తెలంగాణ బిల్లుపై గత కొన్ని రోజులుగా కేంద్ర హోం శాఖలో చర్చలో ఉందని తెలిపారు. బీసీ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా తాము మద్దతు కూడపెడుతున్నామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా కూటమి సభ్యులను కలిసి మద్దతు అడగబోతున్నామని పేర్కొన్నారు మల్లు భట్టి విక్రమార్క.


లోక్‌సభ, రాజ్యసభలో అందరినీ కలిసి మద్దతు అడుగుతామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి బృందంగా వెళ్తున్నామని వెల్లడించారు. బీసీ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం కోసం ఎంపీలను కలిసి మద్దతు కోరుతామని చెప్పుకొచ్చారు. ఇండియా కూటమి, అధికార బీజేపీ ఎంపీలను సైతం కలిసి మద్దతు కోరుతామని అన్నారు. తమకు నమ్మకం ఉందని.. బీసీ బిల్లు ఆమోదం పొందుతుందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయి.. కవిత ఫైర్

మహాలక్ష్మీ.. మరో మైలు రాయి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 22 , 2025 | 07:11 PM