Home » Bhatti Vikramarka Mallu
దేశ నిర్మాణంలో భాగస్వాములవుతోన్న రైతులు, రైతు కూలీల్లో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.
తెలంగాణలో ప్రజలే కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని.. ప్రజలు కేంద్రంగానే పరిపాలన సాగి స్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. భారత్ సదస్సులో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విదేశీ ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వెల్లడించారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి లైఫ్ సైన్సెస్, టూరిజం, ఐటీ వంటి రంగాలు ఎంతో అనుకూలమని, విదేశీ ప్రతినిధులు తమ దేశాలు, సంస్థల ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
అభివృద్ధి విషయంలో తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటి చెప్పడానికే ‘భారత్ సదస్సు-2025’ను నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
ఇంటర్ విద్యార్థులు ఫలితాల్లో అదరగొట్టారు. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. అందులోనూ అమ్మాయిలు ముందంజలో నిలిచారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే కొలువులు దక్కాయని, గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు యువతకు ఉద్యోగాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు.
రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవన ప్రమాణాలు పెరిగి వారి జీవితాలు మారుతాయని.. రాష్ట్రంలో ఈ పథకం ఒక గేమ్ చేంజర్గా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్రంలో 2035 కల్లా 40 వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని (గ్రీన్ పవర్) ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ.565 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సోమవారం భట్టి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.