Share News

Viral Video: మరీ ఇంత సిన్సియర్ వాకింగ్ ఏంట్రా బాబోయ్.. రైలు పట్టాలు దాటుతూ కూడా ఈమె నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Feb 02 , 2025 | 09:27 AM

మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ మహిళ.. మధ్యలో రైలు పట్టాలు దాటాల్సి వచ్చింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న సమయంలోనూ ఆమె ఎలాంటి కంగారూ లేకుండా వ్యవహరించింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

Viral Video: మరీ ఇంత సిన్సియర్ వాకింగ్ ఏంట్రా బాబోయ్.. రైలు పట్టాలు దాటుతూ కూడా ఈమె నిర్వాకం చూడండి..

రైలు ఎక్కి, దిగడం.. రైలు పట్టాలు దాటడం వంటి సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు ఒక్క క్షణం కూడా ఆగలేక.. తొందరపడి చివరకు ప్రాణాలే పోగొట్టుకుంటుంటారు. మరికొందరు ఇలాంటి సందర్భాల్లో వెంట్రకవాసిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రైలు పట్టాలు దాటుతుండగా.. ఉన్నట్టుండి రైలు దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ మహిళ.. మధ్యలో రైలు పట్టాలు దాటాల్సి వచ్చింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న సమయంలోనూ (woman crossing train tracks) ఆమె ఎలాంటి కంగారూ లేకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సింపుల్‌గా నడుస్తూ వెళ్తోంది.

Viral Video: దున్నపోతులకే చుక్కలు చూపించాడుగా.. వెంటబడి దాడి చేసే సమయంలో.. షాకింగ్ ట్విస్ట్..


అయితే తీరా పట్టాలు దాటే సమయంలో అటుగా రైలు వస్తుంటుంది. అయినా ఆమె మాత్రం అదేమీ పట్టించుకోకుండా మెల్లగా నడుస్తూ వెళ్తుంటుంది. రైలు సమీపానికి వచ్చినా కూడా ఆమెలో మాత్రం ఎలాంటి చలనం ఉండదు. తీరా రైలు డ్రైవర్ హారన్ కొట్టడంతో ఉలిక్కిపడి.. పరుగెత్తుకుంటూ రైలు పట్టాలు దాటేస్తుంది. ఈ క్రమంలో ఒక్క క్షణం ఆలస్యం అయి ఉన్నా ఆమె ప్రాణాలే పోయేవి. ఎట్టకేలకు ఆఖరి క్షణంలో అలెర్ట్ అవడంతో ప్రాణాలతో బయటపడింది.

Viral Video: అది వాషింగ్ మెషిన్‌రా అయ్యా.. ఇతనెలా వాడుతున్నాడో చూస్తే ఖంగుతింటారు..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె మార్నింగ్ చేస్తుంటే.. అనవసరంగా రైలు వచ్చి డిస్టర్బ్ చేసిందే’’.. అంటూ కొందరు, ‘‘చావును దగ్గరగా చూడడం అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6.87 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మైట్రో రైల్లో డోరు వద్ద నిల్చున్న అమ్మాయి.. వెనుకే గమనిస్తున్న యువకుడు.. స్టేషన్ రాగానే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 02 , 2025 | 09:27 AM