Viral Video: అది వాషింగ్ మెషిన్‌రా అయ్యా.. ఇతనెలా వాడుతున్నాడో చూస్తే ఖంగుతింటారు..
ABN , Publish Date - Feb 01 , 2025 | 08:58 AM
వాషింగ్‌మెషిన్‌ను ఆన్ చేసిన ఓ వ్యక్తి.. కాసేపటి తర్వాత అందులోని డ్రయ్యర్ మూతను తెరిచాడు. ఇది చూసి అందులో ఉతికిన బట్టలను ఆరబెడుతున్నాడేమో అని అంతా అనుకున్నారు. దాని మూత తీసిన ఆ వ్యక్తి.. అందులో నుంచి ఓ మూటను బయటికి తీశాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

ఇళ్లల్లోని వివిధ రకాల వస్తువులను వింత వింతగా వాడేవారిని చూస్తుంటాం. ఇంట్లో కూలింగ్ కోసం వాడాల్సిన కూలర్‌లో కూరగాయలు పెట్టడం, ఫ్రిడ్జ్‌ను ఏసీలా వాడడం, బాత్రూంకు బీరువా డోర్లు బిగించడం, వాషింగ్ మెషిన్‌లో పాత్రలను శుభ్రం చేయడం.. ఇలా చిత్రవిచిత్రమైన ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వాషింగ్‌మెషిన్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వాషింగ్ మెషిన్ కంపెనీకే షాక్ ఇచ్చాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వాషింగ్‌మెషిన్‌ను ఆన్ చేసిన ఓ వ్యక్తి.. కాసేపటి తర్వాత అందులోని డ్రయ్యర్ మూతను తెరిచాడు. ఇది చూసి అందులో ఉతికిన బట్టలను ఆరబెడుతున్నాడేమో అని అంతా అనుకున్నారు. దాని మూత తీసిన ఆ వ్యక్తి.. అందులో నుంచి ఓ మూటను బయటికి తీశాడు.
Viral Video: ఇది మరీ కామెడీ భయ్యా.. స్నేహితుడిని ఎలా పడేశారో చూస్తే.. పగలబడి నవ్వుతారు..
అప్పటికీ అది దుస్తుల మూట అని అంతా అనుకున్నారు. అయితే ఆ మూటను తెరిచిచూడగా (man drying wheat in washing machine) అందులో గోధుమలు కనిపిస్తాయి. తర్వాత వాటిని అక్కడే ఉన్న ఖాళీ బకెట్‌లో పోస్తాడు. కడిగిన గోధుమలను ఇలా వాషింగ్‌మెషిన్ సాయంతో ఆరబెట్టినట్లు అర్థమవుతుంది. ధాన్యాన్ని ఆరబెట్టడం కోసం విచిత్రంగా ఇలా వాషింగ్‌మెషిన్‌ను వాడడడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: జలకన్య వేషంలో నీటిలోకి దిగిన యువతి.. సడన్‌గా సమీపానికి దూసుకొచ్చిన చేప.. చివరకు..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వాషింగ్‌మెషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400కి పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో.. వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం.. తలుపు తీసి చూడగా లోపలి నుంచి ఒక్కసారిగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..