Share News

Viral Video: దున్నపోతులకే చుక్కలు చూపించాడుగా.. వెంటబడి దాడి చేసే సమయంలో.. షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Feb 01 , 2025 | 09:42 AM

రోడ్డుపై దున్నపోతులు వేగంగా దూసుకొస్తుండగా.. అటూ, ఇటూ నిలబడ్డ జనం ఈలలు, కేకలు వేస్తూ వాటిని రెచ్చగొడుతుంటారు. కొందరు యువకులు రోడ్డు మధ్యలోకి వచ్చి దున్నపోతులను వెంబడిస్తుంటారు. ఈ సమయంలో ఓ యువకుడు సడన్‌గా రోడ్డు మధ్యలోకి వచ్చేస్తాడు. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Viral Video: దున్నపోతులకే చుక్కలు చూపించాడుగా.. వెంటబడి దాడి చేసే సమయంలో.. షాకింగ్ ట్విస్ట్..

బుల్‌ఫైట్‌కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు దున్నపోతుల దాడిలో ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. ఇంకొందరు ఎంతో చాకచక్యంగా ఎలాంటి గాయాలూ కాకుండా తప్పించుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బుల్‌ఫైట్ జరుగుతున్న ప్రాంతంలోకి వెళ్లిన యువకుడు చివరకు వాటికే చుక్కలు చూపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై దున్నపోతులు వేగంగా దూసుకొస్తుండగా.. అటూ, ఇటూ నిలబడ్డ జనం ఈలలు, కేకలు వేస్తూ వాటిని రెచ్చగొడుతుంటారు. కొందరు యువకులు రోడ్డు మధ్యలోకి వచ్చి దున్నపోతులను వెంబడిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని దున్నపోతులు వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ సమయంలో ఓ యువకుడు సడన్‌గా రోడ్డు మధ్యలోకి వచ్చేస్తాడు.

Viral Video: ఇది మరీ కామెడీ భయ్యా.. స్నేహితుడిని ఎలా పడేశారో చూస్తే.. పగలబడి నవ్వుతారు..


అతన్ని టార్గెట్ చేసిన ఓ దున్నపోతు వేగంగా (buffalo chased the young man) వచ్చి యువకుడిని వెంబడుతుంది. ఈ క్రమంలో అతను తప్పించుకోవడంతో దున్నపోతు వేగంగా వెళ్లి జారి కిందపడిపోతుంది. తర్వాత సదరు యువకుడు అక్కడి నుంచి రోడ్డు అవతలికి పారిపోవాలని చూస్తాడు. అయితే రోడ్డు మధ్యలో ఓ దున్నపోతు అతడిని ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో కిందపడ్డ అతను పైకి లేచే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంతలో మరో దున్నపోతు వేగంగా వచ్చి అతన్ని కొమ్ములతో పొడిచేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అతను ఎంతో చాకచక్యంగా తప్పించుకోవడంతో చివరకు రెండు దున్నపోతులు ఢీకొంటాయి.

Viral Video: ఈ కారు డ్రైవర్ ఎంతో అదృష్టవంతుడు.. ఏం జరిగిందో చూస్తే అవాక్కవుతారు..


ఆ తర్వాత అతను పరుగెత్తుకుంటూ వెళ్లి రోడ్డు అవతలి వైపునకు చేరుకుంటాడు. ఇలా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి దున్నపోతుల నుంచి తప్పించుకున్న ఈ వ్యక్తిని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో్.. దున్నపోతులకే చుక్కలు చూపించాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టైం ఎంతో బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, 1.19 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అది వాషింగ్ మెషిన్‌రా అయ్యా.. ఇతనెలా వాడుతున్నాడో చూస్తే ఖంగుతింటారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 01 , 2025 | 09:42 AM