Share News

Viral Video: మైట్రో రైల్లో డోరు వద్ద నిల్చున్న అమ్మాయి.. వెనుకే గమనిస్తున్న యువకుడు.. స్టేషన్ రాగానే..

ABN , Publish Date - Feb 02 , 2025 | 08:10 AM

ఓ యువతి మెట్రో రైల్లో డోరు వద్ద నిల్చుని ఉంటుంది. ఆమె వెనుకే ఓ యువకుడు కూడా నిలబడి ఉంటాడు. ఇందులో షాకింగ్ ఏముందీ.. అని అనుకుంటున్నారా.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘనట చోటు చేసుకుంటుంది. స్టేషన్ రాగానే యువతి దిగాలని చూడగా.. ఊహించని ఘటన చోటు చేసుకుంది..

Viral Video: మైట్రో రైల్లో డోరు వద్ద నిల్చున్న అమ్మాయి.. వెనుకే గమనిస్తున్న యువకుడు.. స్టేషన్ రాగానే..

రైలు ప్రయాణాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు రైలు ప్రయాణ సమయంలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. ప్రయాణికుల మధ్యలో విచిత్ర విన్యాసాలు చేస్తూ కొందరు, ప్రాంక్ వీడియోలు చేస్తూ మరికొందరు.. నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తుంటారు. తాజాగా, ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి మెట్రో రైల్లో డోరు వద్ద నిల్చుని ఉండగా.. ఓ యువకుడు మెనకే నిలబడి గమనిస్తున్నాడు. స్టేషన్ రాగానే ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి మెట్రో రైల్లో (Metro Train) డోరు వద్ద నిల్చుని ఉంటుంది. ఆమె వెనుకే ఓ యువకుడు కూడా నిలబడి ఉంటాడు. ఇందులో షాకింగ్ ఏముందీ.. అని అనుకుంటున్నారా.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘనట చోటు చేసుకుంటుంది. డోరు వద్ద నిల్చున్న యువతి.. తాను దిగాల్సిన స్టేషన్ కోసం ఎదురు చూస్తుంటుంది.

Viral Video: దున్నపోతులకే చుక్కలు చూపించాడుగా.. వెంటబడి దాడి చేసే సమయంలో.. షాకింగ్ ట్విస్ట్..


ఇంతలో స్టేషన్ రాగానే రైలు డోర్లు తెరుచుకుంటాయి. అయితే దిగకముందే వెనుక ఉన్న వ్యక్తి.. ఆమెను కిందకు తోసేస్తాడు. అతను తోయడంతో (man pushed young woman down from the train) సదరు యువతి ఒక్కసారిగా స్టేషన్ ఫ్లాట్‌పామ్‌పై పైకి దూసుకెళ్తుంది. దీంతో షాక్ అయిన ఆమె దిగిన తర్వాత డోరు వద్దకు వచ్చి అతడి వైపు కోపంగా చూస్తుంది. ఇందుకు అతను బాయ్.. బాయ్.. అంటూ చేతులు ఊపుతూ విష్ చేస్తాడు. దీంతో ఆమె చేసేదేమీ లేక సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Viral Video: అది వాషింగ్ మెషిన్‌రా అయ్యా.. ఇతనెలా వాడుతున్నాడో చూస్తే ఖంగుతింటారు..


ఇదంతా చూస్తుంటే.. లైక్‌‌లు, వ్యూస్ కోసం కావాలని చేసినట్లుగా అనిపిస్తున్నా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేయడం కామన్ అయిపోయింది’’.. అంటూ కొందరు, ‘‘యువతికి ఇలా షాకిచ్చాడేంటీ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 18వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ కారు డ్రైవర్ ఎంతో అదృష్టవంతుడు.. ఏం జరిగిందో చూస్తే అవాక్కవుతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 02 , 2025 | 08:10 AM