Share News

Viral Video: ఈ బైకును చోరీ చేయడం అంత ఈజీ కాదు.. ఇతను తీసుకున్న జాగ్రత్తలు చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:16 PM

చోరీలు జరక్కుండా కొందరు ముందు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మరికొందరు ఎవరూ చేయని విధంగా చిత్రవిచిత్రమైన ఏర్పాట్లు చేసుకుంటుంటారు. కారు చోరీ కాకుండా పైన ముళ్ల కంచె వేయడం, బైకు టైర్లకు గొలుసులు కట్టడం వంటి పనులు చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటారు. తాజాగా..

Viral Video: ఈ బైకును చోరీ చేయడం అంత ఈజీ కాదు.. ఇతను తీసుకున్న జాగ్రత్తలు చూస్తే నోరెళ్లబెడతారు..

చోరీలు జరక్కుండా కొందరు ముందు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మరికొందరు ఎవరూ చేయని విధంగా చిత్రవిచిత్రమైన ఏర్పాట్లు చేసుకుంటుంటారు. కారు చోరీ కాకుండా పైన ముళ్ల కంచె వేయడం, బైకు టైర్లకు గొలుసులు కట్టడం వంటి పనులు చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన బైకును ఎవరూ ఎత్తుకెళ్లకుండా విచిత్రమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ బైకును చోరీ చేయడం అంత ఈజీ కాదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగుతుండగా.. చుట్టూ చాలా మంది నిలబడి చూస్తున్నారు. వారి వెనుక చాలా బైకులు పార్క్ చేసి ఉన్నాయి. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన బైకును పార్క్ చేసి, దాని ఎదురుగా నిలబడి మ్యాచ్ తిలకిస్తున్నాడు.

Viral Video: గర్జించే మొసళ్లను ఎప్పుడైనా చూశారా.. అన్నీ చుట్టూ చేరి ఏం చేస్తున్నాయో చూడండి..


అయితే మరోవైపు తన బైకు చోరీ కాకుండా ఉండేందుకు వినూత్నంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. బైకును పార్క్ చేసి, దాని హ్యాండిల్‌కు (man tied cloth to bike handle) టవల్ కట్టాడు. తర్వాత దాన్ని మరో చివరను చేత్తో పట్టుకుని, మ్యా్చ్ చూస్తున్నాడు. ఇలా ఆ వ్యక్తి ఓ వైపు మ్యాచ్ చూస్తూనే.. మరోవైపు తన బైకు చోరీ కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: చుట్టూ సింహాలు.. మధ్యలో జిరాఫీ.. దాడి చేయాలని చూడగా షాక్.. చివరకు చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పెద్దాయన ముందు జాగ్రత్తలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 170కి పైగా లైక్‌లు, 13 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Airport Viral Video: పాకిస్థాన్‌ ఎయిర్‌పోర్టులో ఇలా చేస్తారా.. ప్రయాణికుల నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 21 , 2025 | 04:16 PM