Share News

Optical illusion: మీలో పరిశీలనా సామర్థ్యం ఉంటే.. ఈ చిత్రంలో తప్పు ఏంటో చెప్పండి చూద్దాం..

ABN , Publish Date - Feb 16 , 2025 | 01:19 PM

ఈ చిత్రంలో మీకు ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు. ఓ బాలిక ఊయల ఊగుతుండగా.. పక్కనే నిలబడ్డ బాలుడు ఊయను ఊపుతున్నాడు. వారి పక్కనే ఓ పెద్ద చెట్టు కూడా ఉంది. అయితే ఇదే చిత్రంలో మీకు తెలీకుండా ఓ తప్పు దాగి ఉంది. దాన్ని గుర్తించేందుకు ప్రయత్నించండి..

Optical illusion: మీలో పరిశీలనా సామర్థ్యం ఉంటే.. ఈ చిత్రంలో తప్పు ఏంటో చెప్పండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు చూసేందుకు సాధారణంగా అనిపించినా.. అందులో అనేక పజిల్స్ దాక్కుని ఉంటాయి. కొన్ని చిత్రాల్లో దాక్కున్న పజిల్స్‌ను పరిష్కరించడం ఎంతో కష్టంగా మారుతుంటుంది. అయినా అలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం వల్ల మనలో పరిశీలినా శక్తి మరింత పెరుగుతుంది. అలాగే ఏకాగ్రత పెరగడంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. సోషల్ మీడియాలో ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేకం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ చిత్రంలో తప్పు ఎక్కడుందో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మీకు ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు. ఓ బాలిక ఊయల ఊగుతుండగా.. పక్కనే నిలబడ్డ బాలుడు ఊయను ఊపుతున్నాడు. వారి పక్కనే ఓ పెద్ద చెట్టు కూడా ఉంది.

Optical illusion: మీ కంటి చూపు బాగుందా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న మరో మనిషిని 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


అలాగే వారి వెనుక పచెట్ట పొదలను కూడా చూడొచ్చు. ఇంతకు మించి ఇక్కడ మరే మనిషి కానీ, జంతువులు కానీ కనిపించవు. అయితే ఇక్కడే మీ కంటికి ఓ పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఇదే చిత్రం చూస్తుంటే ఇందులో ఎలాంటి తప్పులూ లేనట్లు కనిపిస్తున్నా కూడా.. మీ కళ్లుగప్పి ఓ తప్పు దాగి ఉంది.

Optical illusion: ఆహార ప్రియులు మాత్రమే.. ఇందులో బర్గర్ ఎక్కడుందో కనిపెట్టగలరు..


ఆ తప్పును కనిపెట్టేందుకు ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందకు ఆలస్యం ఆ తప్పు ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ తప్పును కనిపెట్టలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: చురుకైన చూపుగలవారు మాత్రమే.. జింకను వేటాడేందుకు దాక్కున్న పులిని గుర్తించగలరు..


optical-illusion-viral.jpg

పాప ఊగుతున్న ఊయలలోనే తప్పంతా దాగి ఉంది. ఊయలకు ఏర్పాటు చేసిన చెక్క పలకకు ముందు, వెనుక తాడు కట్టి ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం కేవలం ముందు వైపు మాత్రమే తాడు కట్టి ఉంది. వెనుక వైపు ఎలాంటి తాడూ కట్టలేదు. దీనివల్ల కిందపడిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఈ తప్పును ఎవరు ముందుగా గుర్తించి ఉంటే.. వారిలో పరిశీలనా శక్తి ఎక్కువ ఉందని అర్థం.

Optical illusion: మీ కంటికి పెద్ద పరీక్ష.. ఈ చిత్రంలో దాక్కున్న 3 ముఖాలను 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 16 , 2025 | 01:19 PM