Viral Video: గర్జించే మొసళ్లను ఎప్పుడైనా చూశారా.. అన్నీ చుట్టూ చేరి ఏం చేస్తున్నాయో చూడండి..
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:24 AM
మొసళ్లు చూసేందుకు ఎంత భయంకరంగా ఉంటాయో.. వాటి వేట కూడా అంతే భయంకరంగా ఉంటుంది. నీటిలోకి వచ్చిన ఎలాంటి జంతువునైనా ఇట్టే పట్టేసుకుంటాయి. కొన్నిసార్లు ఇలాంటి మొసళ్లు సైతం విచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది..

మొసళ్లు చూసేందుకు ఎంత భయంకరంగా ఉంటాయో.. వాటి వేట కూడా అంతే భయంకరంగా ఉంటుంది. నీటిలోకి వచ్చిన ఎలాంటి జంతువునైనా ఇట్టే పట్టేసుకుంటాయి. కొన్నిసార్లు ఇలాంటి మొసళ్లు సైతం విచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ముందు కాళ్లు పైకి పెట్టి.. నీటిలో మునిగిపోతున్నట్లు నటించే మొసళ్లను చూశాం. మనుషులతో స్నేహంగా ఉండే మొసళ్లను కూడా చూశాం. ఇలంటి విచిత్ర మొసళ్లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీటిలో చుట్టూ చేరి గర్జిస్తున్న ఎలిగేటర్లను చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓర్లాండోలోని ఓ రిజర్వాయర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద పెద్ద ఎలిగేటర్లన్నీ (alligators) కలిసి ఒకటోట చేరాయి. అన్నీ తలలను నీటిపైకి పెట్టి సింహాల తరహాలో గర్జిస్తున్నాయి.
Marriage Viral Video: ఈ వరుడేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. వేదికపై మహిళలకు ఎలా షాక్ ఇచ్చాడో చూడండి..
ఒకదాని తర్వాత మరొకటిగా.. ఇలా అన్నీ వింత వింత శబ్ధాలు (Alligators making strange noises) చేస్తూ అరుస్తున్నాయి. మొసళ్లు ఇలా విచిత్రంగా గర్జించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా మొసళ్లు సైలెంట్‌గా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఇలా సింహాల తరహాలో ఇలా గర్జించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Kangaroo Rat Video: కంగారూ ఎలుకా మజాకా.. పాము దాడి చేయగానే.. ఏం చేసిందో చూడండి..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొసళ్లు ఇలా గర్జించడం ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఈ శబ్ధాలు వింటుంటేనే భయంగా ఉంది బాబోయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: రాత్రి వేళ పాడుబడ్డ ఇంట్లో నుంచి అరుపులు.. లోపలికి వెళ్లి చూడగా.. చివరకు షాకింగ్ సీన్..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..