Tea seller Video: ఇది కదా బిజినెస్ ట్రిక్ అంటే.. రైల్లో టీ ఎలా విక్రయిస్తున్నాడో చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..
ABN , Publish Date - Feb 15 , 2025 | 08:44 PM
ఓ చిరు వ్యాపారి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై అటూ, ఇటూ తిరుగుతూ టీ విక్రయిస్తుంటాడు. ఇంతలో ఓ బోగీలో ఉన్న వారు టీ కావాలంటూ అతన్ని పిలుస్తారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

రైలు ప్రయాణంలో వివిధ రకాల చిరు వ్యాపారులను చూస్తుంటాం. కొందరు వ్యాపారులు ఎంతో చాకచక్యంగా వ్యాపారం చేయడం చూస్తుంటాం. కదులుతున్న రైలును వెంటపడి ఎక్కి మరీ టీ తదితర ఆహార పదార్థాలను విక్రయించడం చూస్తుంటాం. కొందరైతే ఎంత బోగీలో ప్రయాణికులు ఎంత రద్దీగా ఉన్నా కూడా ఎంతో సులభంగా వ్యాపారాలు సాగిస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ వ్యక్తి టీ అమ్ముతున్న విధానం చూసి అంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘బిజినెస్ ట్రిక్స్ అంటే ఇవీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిరు వ్యాపారి రైల్వే స్టేషన్ (Railway station) ప్లాట్‌ఫామ్‌పై అటూ, ఇటూ తిరుగుతూ టీ విక్రయిస్తుంటాడు. ఇంతలో ఓ బోగీలో ఉన్న వారు టీ కావాలంటూ అతన్ని పిలుస్తారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Watch Video: చితి వద్ద ఈ పనులేంట్రా నాయనా.. ఇతను ఏం చేస్తున్నాడో చూస్తే.. ఖంగుతింటారు..
బోగీలోకి వెళ్లే అవకాశం లేకపోగా.. కిటికీ నుంచి కూడా టీ ఇవ్వలేని విధంగా ఉంది. కిటికీకి తెరిచే డోర్లు లేకుండా ఇనుప కంచె ఏర్పాటు చేసి ఉంటారు. దీంతో ఇక టీ తాగలేమో అని ప్రయాణికులు అనుకుంటారు. కానీ టీ విక్రేత (Tea seller) మాత్రం తన బుర్రకు పని చెబుతాడు. ముందుగా ఖాళీ టీ కప్పును మడతపెట్టి ఇనుప కడ్డీల మధ్యలో నుంచి లోపలికి అందిస్తాడు. ఆ తర్వాత ప్రయాణికుడు దాన్ని సరి చేసి కిటికీపై పెట్టగా.. వ్యాపారి బయటికి నుంచి టీ కెటిల్‌ను లోపలికి పెట్టి కప్పులో టీ పోస్తాడు.
Viral Video: వీడెవర్రా బాబోయ్.. బంతి భోజనాలు చేస్తూ.. మధ్యలో ఏం చేశాడో చూడండి..
ఇలా ఆ వ్యాపారి తెలివిగా ఆలోచించి, టీ విక్రయించడం చూసి అంతా అతన్ని ప్రశంసించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బుర్రకు పని చెప్పడం అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 50 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంత చేసుకుంది.
Viral Video: ధాబాలో చపాతీ తింటున్నారా.. ఇతను ఎలా చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..