Viral Video: ధాబాలో చపాతీ తింటున్నారా.. ఇతను ఎలా చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:59 PM
కొందరు వినూత్నమైన పద్ధతిలో, నోరూరించే రుచులతో సరికొత్త వంటకాలు చేస్తూ భోజన ప్రియులను ఆకట్టుకుంటుంటే.. మరికొందరు మాత్రం వంట చేయడంలో కొంచెం కూడా శుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తుంటారు. మరికొందరు మరీ అధ్వానంగా ప్రవర్తిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి..

కొందరు వినూత్నమైన పద్ధతిలో, నోరూరించే రుచులతో సరికొత్త వంటకాలు చేస్తూ భోజన ప్రియులను ఆకట్టుకుంటుంటే.. మరికొందరు మాత్రం వంట చేయడంలో కొంచెం కూడా శుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తుంటారు. మరికొందరు మరీ అధ్వానంగా ప్రవర్తిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి చిత్ర విచత్రమైన వంట వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ధాబాలో చపాతీ చేస్తున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ధాబాలో చపాతీ చేసేందుకు (man making chapatis in dhaba) పిండిని సిద్ధం చేస్తుంటాడు. ఓ వైపు కస్టమర్లు భోజనం చేస్తుండగా.. వారికి ఎదురుగా ప్రహరీ గోడ పక్కన అపరిశుభ్ర ప్రదేశంలో (Dirty place) పిండిసి పిసుకుతుంటాడు. పెద్ద పాత్రలో పిండిని వేసి, అపరిశుభ్ర చేతులతో దాన్ని అటూ.. ఇటూ తిప్పుతూ ఉంటాడు.
Lorry Journey Video: అవసరం ఏపనైనా చేయిస్తుందంటే ఇదేనేమో.. లారీ వెనుక వీళ్ల నిర్వాకం చూడండి..
మధ్యలో మధ్యలో కింద అపరిశుభ్ర మగ్‌లో ఉన్న నీటిని తీసుకుని పిండిలో పోస్తుంటాడు. ఇలా చాలా సేపు పిండిని పిసుకుతూ తర్వాత దాన్ని పెద్ద చెక్క టేబుల్‌పై వేస్తాడు. దానిపై పాత బట్టను కప్పి ఉంచుతాడు. వీడియో తీస్తున్న వ్యక్తి అతడి వద్దకు వెళ్లి.. చపాతీ పిండి సిద్ధం చేస్తున్న విధానంపై నిలదీస్తాడు. ఇందుకు అతను కాసేపు మౌనంగా ఉండి.. తర్వాత సమాధానం చెప్పకుండా దూరంగా వెళ్లిపోతాడు.
Viral Video: వామ్మో..! ఈమేంటీ ఇలా చేసిందీ.. రీల్స్ కోసం కొడుకును ఏం చేస్తుందో చూడండి..
ఇలా ఆ వ్యక్తి అపరిశుభ్రంగా చపాతీ చేయడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. మరీ ఇంత అధ్వానంగా చేస్తు్న్నరేంటీ’’.. అంటూ కొందరు, ‘‘ఇంకోసారి ధాబాలో చపాతీలు తినాలంటేనే భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా లైక్‌లు, 4.90 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..