Share News

Train Accident Video: గేటు వేసినా పట్టాల మీదకు వెళ్లిన కారు.. చివరికి జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Feb 14 , 2025 | 10:15 AM

రైల్వే గేటు వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు వస్తుండడంతో రోడ్డుపై రెండు వైపులా గేట్లను మూసేశారు. అయితే తీరా గేట్లు మూసే సమయంలో ఓ వ్యక్తి కారులో దూసుకొచ్చాడు. అదే సమయంలో రైలు వేగంగా రావడంతో చివరికి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Train Accident Video: గేటు వేసినా పట్టాల మీదకు వెళ్లిన కారు.. చివరికి జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..

రైలు పట్టాలు దాటుతూ చాలా మంది ప్రమాదాలకు గురవడం చూస్తుంటాం. కొందరు నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ ప్రమాదానికి గువుతుంటే.. మరికొందరు త్వరగా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కారు గేటు వేసినా కూడా పట్టాల మీదకు దూసుకెళ్లింది. చివరకు జరిగింది చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. యూకేలోని (UK) ఉటా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న రైల్వే గేటు వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు వస్తుండడంతో రోడ్డుపై రెండు వైపులా గేట్లను మూసేశారు. అయితే తీరా గేట్లు మూసే సమయంలో ఓ వ్యక్తి కారులో దూసుకొచ్చాడు. గేటు వేస్తున్నారని తెలిసినా కూడా పట్టాల మీదకు వచ్చే ప్రయత్నం చేశాడు.

Viral Video: కళ్యాణ మంటపంలోకి చొరబడిన చిరుత.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


అతను లోపలికి రాగానే గేట్లు వేశారు. దీంతో కారు అక్కడే ఆగిపోయింది. అంతలో అటుగా రైలు రావడం చూసి కారు డ్రైవర్ భయపడ్డాడు. వెనక్కు రావాలని చూసినా, గేటు మూసి ఉండడంతో సాధ్యం కాలేదు. దీంతో చివరకు డ్రైవింగ్ సీటు నుంచి కిందకు దిగి దూరంగా వెళ్లిపోతాడు. వేగంగా వచ్చిన రైలు చూస్తుండగానే కారును (train hit a car) బలంగా ఢీకొంటుంది. ఈ ఘటనలో కారు ముందు భాగం తునాతునకలైపోతుంది. ఈ ప్రమాదంలో రైల్వేకి 100000 డాలర్ల (రూ.8689000) నష్టం వాటిళ్లింది.

Viral: రూ.7కోట్ల జీతంతో భర్తకు ప్రమోషన్.. విడాకులు ఇస్తున్నానంటూ భార్య షాక్.. కారణమేంటో తెలిస్తే..


రైలు వచ్చే ముందు కారు డ్రైవర్ ముందుకు వెళ్లి రోడ్డు మధ్యలో ఆగి ఉండుంటే ప్రమాదం తప్పి ఉండేదని, తొందరపాటులో ప్రమాదానికి కారణమయ్యాడని అంతా అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 35 వేలకు పైగా లైక్‌లు, 12 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Women Funny Video: ఇద్దరు మహిళలు కలిస్తే ఇంతేనేమో.. ఈమె ఎలాంటి పరిస్థితిలో మాట్లాడుతుందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Updated Date - Feb 14 , 2025 | 10:27 AM