Viral Video: కళ్యాణ మంటపంలోకి చొరబడిన చిరుత.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ABN , Publish Date - Feb 14 , 2025 | 09:19 AM
కళ్యాణ మంటపంలో జరిగిన వివాహ కార్యక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇరు కుటుంబాల తరపు బంధువులతో కళ్యాణ మంటపం సందడి సందడిగా ఉంది. అంతా సంతోషంగా ఉన్న ఆ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ చిరుత పులి కళ్యాణ మంటపంలోకి వచ్చేసింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

అటవీ సమీప ప్రాంతాల్లో క్రూర మృగాలు జనావాసాల్లోకి చొరబడడడం తరచూ జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో కుక్కలు, ఆవులు, మేకలు వంటి జంతువులపై దాడి చేసి చంపేస్తుంటాయి. మరికొన్నిసార్లు ఏకంగా మనుషులపై దాడి చేస్తుంటాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ చిరుత పులి వీడియో తెగ వైరల్ అవుతోంది. చిరుత పులి కళ్యాణ మంటపంలోకి చొరబడడంతో అంతా భయంతో పరుగులు తీశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నోలోని పారా ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బుద్ధేశ్వర్ రింగ్ రోడ్‌లోని ఓ కళ్యాణ మంటపంలో జరిగిన వివాహ కార్యక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇరు కుటుంబాల తరపు బంధువులతో కళ్యాణ మంటపం సందడి సందడిగా ఉంది. అంతా సంతోషంగా ఉన్న ఆ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు గానీ.. ఓ చిరుత పులి కళ్యాణ మంటపంలోకి వచ్చేసింది.
Viral: రూ.7కోట్ల జీతంతో భర్తకు ప్రమోషన్.. విడాకులు ఇస్తున్నానంటూ భార్య షాక్.. కారణమేంటో తెలిస్తే..
చిరుతను చూడగానే లోపల ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసు, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. రైఫిల్స్ పట్టుకున్న పోలీసులు.. (Leopard Entered Wedding Hall) కళ్యాణ మంటపంలోకి ప్రవేశించి, చిరుత కోసం వెతికారు. పై అంతస్తులోకి వెళ్తుండగా చిరుత ఒక్కసారిగా వారికి ఎదురుగా వచ్చింది. ఈ క్రమంలో అటవీ సిబ్బందిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ ఘటనతో పోలీసు తుపాకీ జారిపడిపోయింది. ఆ తర్వాత వారంతా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు.
Women Viral Video: ఫ్యాంట్ వెనుక జేబులో ఫోన్ పెట్టుకున్న మహిళ.. షాపింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి..
అయితే చివరకు అతికష్టం మీద చిరుతపులికి మత్తు మందు ఇచ్చి బంధించారు. దీంతో అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పులిని చూడటానికి అంతా జూకు వెళితే.. ఇక్కడ అలాంటి కష్టం లేకుండా పులే వచ్చేసింది’’.. అంటూ కొందరు, ‘‘వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చిందేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, 56 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Women Funny Video: ఇద్దరు మహిళలు కలిస్తే ఇంతేనేమో.. ఈమె ఎలాంటి పరిస్థితిలో మాట్లాడుతుందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..