Share News

Whale Viral Video: మృత్యువు నోరు తెరవడమంటే ఇదేనేమో.. బోటును మింగిన తిమింగళం.. చివర్లో షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:37 AM

తండ్రీకొడుకులు కలిసి చిన్న చిన్న బోట్లలో సముద్రంలోకి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆడ్రియన్ పడవను ఓ పెద్ద తిమింగళం అటాక్ చేసింది. అయితే చివరకు ఎవరూ ఊహించని విధంగా ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది..

Whale Viral Video: మృత్యువు నోరు తెరవడమంటే ఇదేనేమో.. బోటును మింగిన తిమింగళం.. చివర్లో షాకింగ్ ట్విస్ట్..

సముద్ర ప్రయాణం ఎంత ఉల్లాసాన్ని కలిగిస్తుందో.. అప్పుడప్పుడూ అంతే స్థాయిలో భయాన్నీ కలిగిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా సొర చేపలు, తిమింగళాల రూపంలో ప్రమాదం పొంచి ఉంటుంది. చాలా మంది వీటిబారిన పడి ప్రాణాలను పోగొట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బోటుపై షికారుకు వెళ్లిన ఓ వ్యక్తిపై తిమింగళం దాడి చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చిలీలోని పటగోనియా సముద్ర తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డేల్, ఆడ్రియన్ అనే తండ్రీకొడుకులు కలిసి చిన్న చిన్న బోట్లలో సముద్రంలోకి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆడ్రియన్ పడవను ఓ పెద్ద తిమింగళం అటాక్ చేసింది. చూస్తుండగానే ఒక్కసారిగా (whale tried to swallow boat) నీటి పైకి వచ్చి నోరు తెరచింది. దీంతో ఆ వ్యక్తి చూస్తుండగానే పడవతో పాటూ అందులోకి వెళ్లిపోయాడు.

Train Accident Video: గేటు వేసినా పట్టాల మీదకు వెళ్లిన కారు.. చివరికి జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..


కొడుకును తిమింగళం మింగేయడం చూసిన డేల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే అంతలోనే ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. తిమింగళం నోటిలో చిక్కుకున్న ఆడ్రియన్.. కాసేపటికి బోటుతో సహా నీటిపైకి వచ్చేశాడు. కొడుకును ప్రాణాలతో బయటికి రావడం చూసి తండ్రి డేల్ ఎంతో సంతోషించాడు. ఈడుకుంటూ వెళ్లిన కొడుకు.. తండ్రి పడవను పట్టుకున్నాడు. కొడుక్కు ధైర్యం చెప్పిన తండ్రి.. పడవను వేగంగా నడుపుతూ దూరంగా తీసుకెళ్లాడు.

Viral Video: కళ్యాణ మంటపంలోకి చొరబడిన చిరుత.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఎట్టకేలకు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా లైక్‌లు, 1.96 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: రూ.7కోట్ల జీతంతో భర్తకు ప్రమోషన్.. విడాకులు ఇస్తున్నానంటూ భార్య షాక్.. కారణమేంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Updated Date - Feb 14 , 2025 | 11:38 AM