Viral Video: చుట్టూ సింహాలు.. మధ్యలో జిరాఫీ.. దాడి చేయాలని చూడగా షాక్.. చివరకు చూస్తే..
ABN , Publish Date - Feb 16 , 2025 | 01:52 PM
ఆకలితో ఉన్న చాలా సింహాలు వేట కోసం కాచుకుని ఉంటాయి. ఇంతలో వాటికి దూరంగా ఓ పెద్ద జిరాఫీ నీళ్లు తాగుతూ కనిపిస్తుంది. దాన్ని చూడగానే.. ఈ పూట మన పంట పండింది.. అనుకుంటూ అన్నీ కలిసి సమూహంగా దాడి చేయడానికి వెళ్తాయి. చివరకు ఏం జరిగిందో చూడండి..

సింహం సింగల్‌గా వచ్చినా చాలు.. ఎలాంటి జంతువునైనా ఇట్టే మట్టి కరిపిస్తుంది. అలాంటిది పదుల సంఖ్యలో సింహాలు వేట వెళ్లాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అన్నిసార్లూ ఇలాగే ఉంటుందా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఎన్ని సింహాలు కలిసివచ్చినా చివరికి నిరాశే ఎదురవుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా అనేక వీడియోలను చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పదుల సంఖ్యలో సింహాలు ఒక్క జిరాఫీని చుట్టుముడతాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న చాలా సింహాలు వేట కోసం కాచుకుని ఉంటాయి. ఇంతలో వాటికి దూరంగా ఓ పెద్ద జిరాఫీ నీళ్లు తాగుతూ కనిపిస్తుంది. దాన్ని చూడగానే.. ఈ పూట మన పంట పండింది.. అనుకుంటూ అన్నీ కలిసి సమూహంగా దాడి చేయడానికి వెళ్తాయి. ఒక్కసారిగా జిరాఫీని చుట్టుముట్టి చంపేందుకు ప్రయత్నిస్తాయి.
Optical illusion: మీలో పరిశీలనా సామర్థ్యం ఉంటే.. ఈ చిత్రంలో తప్పు ఏంటో చెప్పండి చూద్దాం..
సింహాలు దాడితో అలెర్ట్ అయిన జిరాఫీ (lions tried to attack giraffe) అక్కడి నుంచి పరుగందుకుంటుంది. మరో వైపు సింహాలు కూడా వేగంగా పరుగెడుతూ జిరాఫీని కిందపడేయాలని చూస్తాయి. కానీ జిరాఫీ మాత్రం ఏమాత్రం భయపడకుండా మరింత వేగంగా పరుగెడుతూ మధ్యలో మధ్యలో సింహాలను వెనుక కాళ్తతో తన్నుతూ ఉంటుంది. ఇలా కొంత దూరం వెళ్లేసరికి వాటిలో చాలా సింహాలు భయంతో ఆగిపోతాయి. ఉన్న కొద్ది సింహాలను కూడా దాటుకుని జిరాఫీ మరింత వేగంతో అక్కడి నుంచి పారిపోతుంది.
Elephant Viral Video: ఏనుగును బంధిస్తే ఏమవుతుందో తెలుసా.. ఇనుప పెన్సింగ్‌ను ఏం చేసిందో చూడండి..
ఇలా సింహాల గుంపు చుట్టుముట్టినా కూడా భయపకుండా (Giraffe escaped from lions) ప్రాణాలను దక్కించుకున్న జిరాఫీని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ జిరాఫీ పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సింహాలకు చుక్కలు చూపించినా జిరాఫీ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1900కి పైగా లైక్‌లు, 9 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: గర్జించే మొసళ్లను ఎప్పుడైనా చూశారా.. అన్నీ చుట్టూ చేరి ఏం చేస్తున్నాయో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి