Share News

Longest Car: వామ్మో.. రైలు లాంటి కారు.. ఇందులో సదుపాయాలు చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Apr 20 , 2025 | 10:56 AM

వాహనాల విషయంలో ఇప్పటికీ అనేక రకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అలాగే చిత్రవిచిత్రమైన వాహనాలను తయారు చేసి ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. ఇలాంటి ఆశ్చర్యానికి గురి చేసే కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

Longest Car: వామ్మో.. రైలు లాంటి కారు.. ఇందులో సదుపాయాలు చూస్తే షాకవ్వాల్సిందే..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అన్ని రంగాల్లోనూ రోజు రోజుకూ కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. ఇక మోటారు రంగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఎద్దుల బండితో మొదలైన ప్రయాణం.. రిక్షా, బైకు, కారు, బస్సు, రైలు, విమానం.. ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇప్పటికీ వాహనాల విషయంలో అనేక రకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అలాగే చిత్రవిచిత్రమైన వాహనాలను తయారు చేసి ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. ఇలాంటి ఆశ్చర్యానికి గురి చేసే కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైలును మరిపిస్తున్న ఈ కారు ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కాలిఫోర్నియాకు చెందిన జే ఓర్‌బర్గ్ అనే వ్యక్తి 1986లో పొడవైన కారును (Longest Car) తయారు చేశాడు. అయితే ఈ కారులో ఇటీవల మరికొన్ని మార్పులు చేసి, సరికొత్తగా తయారు చేశాడు. 100 అడుగుల పొడవున్న ఈ కారుకు 26 టైర్లు ఉన్నాయి. అలాగే కారుకు రెండు వైపులా రెండు ఇంజిన్లు కూడా ఉన్నాయి. దీంతో ఈ కారును రెండు వైపుల నుంచి నడిపే వీలు ఉందన్నమాట.

Optical illusion: మీలోని తీక్షణా శక్తికి సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న StORM అనే పదాలను 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..


ఈ కారులోని ప్రత్యేకతలు ఇంతే అనుకుంటే పొరపాటే. స్విమ్మింగ్ పూల్, వాటర్ బెడ్, బాత్‌టబ్, గోల్ఫ్ కోర్ట్ తదితరాలతో పాటూ చివరికి దీనిపై హెలీప్యాడ్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీనిపై 5 వేల పౌండ్ల బరువును ఉంచేందుకు వీలుగా తయారు చేశారు. ఇక ఈ కారులో సుమారు 75 మంది ప్రయాణించేదుకు వీలు ఉందన్నమాట. ఇంతటితో అయిపోలేదంటే.. ఈ కారులో ఇంకా టీవీ, ఫ్రిజ్, టెలిఫోన్ సహా వివిధ రకాల ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా గిన్నిస్ బుక్‌లోకి కూడా ఎక్కిందన్నమాట.

Funny Viral Video: ఇదేం వింత పరీక్షరా నాయనా.. వాషింగ్ మెషిన్‌లో రాయి వేయడంతో.. చివరకు..


కాగా, ఈ కారుకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇది కారా లేక రైలా’’.. అంటూ కొందరు, ‘‘ఇది కారు కాదు ఇంద్రభవంనంలా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 89 వేలకు పైగా లైక్‌‌లను సొంతం చేసుకుంది.

Monkeys War Viral Video: గ్రూపు గొడవలు వీటికీ తప్పలేదుగా.. కోతులన్నీ ఎలా కొట్టుకుంటున్నాయో చూడండి..


ఇవి కూడా చదవండి..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2025 | 10:56 AM