Marriage Viral Video: ఓ వైపు పెళ్లి.. మరోవైపు ప్రమాదం.. ఈ అతిథులకు ఏమైందో చూస్తే..
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:07 AM
ఓ ఇంటి మేడ పైన ఉండే గదిలో వివాహం జరుగుతుంటుంది. వేదికపై వరుడు వింత వేషధారణలో కూర్చుని ఉండగా.. వధువు ముఖానికి ముసుగు ధరించి పక్కనే కూర్చుని ఉంటుంది. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లలో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. పెళ్లి మంటపంలోకి వినూత్న రీతిలో ఎంట్రీ ఇవ్వడం దగ్గర నుంచి ప్రతి ఘట్టాన్నీ వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం ఎలాంటి ప్లాన్ చేయకుండానే అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వివాహంలో చోటు చేసుకున్న ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి మేడ పైన ఉండే గదిలో వివాహం (Marriage) జరుగుతోంది. వేదికపై వరుడు వింత వేషధారణలో కూర్చుని ఉండగా.. వధువు ముఖానికి ముసుగు ధరించి పక్కనే కూర్చుంది. ఎదురుగా ఉన్న బంధువులు.. వారి సాంప్రదాయం ప్రకారం కార్యక్రమం నిర్వహిస్తుంటారు.
వధూవరుల (Bride and groom) పక్కనే బంధువులంతా నిలబడి వేడుక చూస్తుంటారు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వధూవరుల పక్కనే పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దానిపై నిలబడి (Guests fell from first floor) ఉన్న వారంతా కిందపడిపోయారు. కిందపడిన వెంటనే అంతా ఎలాగోలా పైకి లేచి, అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తమ పక్కనే నిలబడి ఉన్న వారు సడన్‌గా ఇలా కింద పడిపోవడంతో వధూవరులతో పాటూ అక్కడున్న మిగతా వారు షాక్ అయ్యారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎవరికి ఏం జరిగినా.. కెమెరామెన్‌కి ఏం కాదు’.. అంటూ కొందరు, ‘అరెరే.. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 97 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..